పార్టీ పగ్గాల కోసం కవిత కేటీఆర్ మధ్య పోటీ.. బీఆర్ఎస్ లో మరో సంక్షోభం?

Publish Date:Jan 2, 2025

Advertisement

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత బీఆర్ఎస్ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై అధికారాన్ని కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  అనూహ్యంగా రాజకీయాలకు దూరంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పరిమితమైపోయారు. ఇది పార్టీ క్యాడర్ విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మరింత ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. కనీసం ఒక్క లోక్ సభ స్థానంలోనూ విజయం సాధించలేకపోవడమే కాకుండా, ఓటు బ్యాంకును కూడా భారీగా కోల్పోయింది. ఇక కేసీఆర్ ఇన్ యాక్టివ్ అయిన సమయంలో పార్టీని నడిపిస్తున్న ఆయన తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనదైన ముద్ర చూపడంలో ఘోరంగా విఫలమయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీపై ఆయన చేస్తున్న విమర్శలు పెద్దగా ప్రభావం చూపుతున్నట్లు కనిపించడం లేదు. రుణమాఫీ, రైతు భరోసా, అలాగే ఎన్నికల హామీల అమలులో రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజలలో ఎండగట్టడంలో కేటీఆర్ నాయకత్వం విఫలమైందన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. 

ఒక పక్క కేటీఆర్ తన నాయకత్వ పటిమను చాటుకోవడంలో విఫలమౌతున్న సమయంలోనే, పార్టీకి మరో సారి నాయకత్వ సంక్షోభం ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేశాయి. విచారణకు రావలసిందిగా నోటీసులు కూడా జారీ చేశాయి. ఈ కేసులో కేటీఆర్ అరెస్టయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీంతో మరోసారి బీఆర్ఎస్  నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరీష్ రావు ఉన్నప్పటికీ ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలో కేసీఆర్ కానీ, ఆయన పిల్లలు కేటీఆర్, కవితలు సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ రాజకీయవారసత్వాన్ని అందుకోవాలన్న అభిలాషను కల్వకుంట్ల కవిత వ్యక్తం చేస్తున్నారు. 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై కొన్ని నెలల పాటు తీహార్ జైలులో ఉండి బెయిలుపై విడుదలైన తరువాత కవిత చాలా కాలం స్తబ్దుగా ఉన్నారు. ఆమె కూడా రాజకీయాలకు దూరమౌతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే జైలు నుంచి విడుదలై వచ్చిన తరువాత కొంత గ్యాప్ తీసుకున్న కవిత ఇప్పుడు మళ్లీ చురుకుగా రాజకీయాలలో పాల్గొంటున్నారు. అంతే కాకుండా ఇటీవల ఆమె నిజామాబాద్ పర్యటించిన సందర్భంలో ఆమె అభిమానులు సీఎం కవిత, సీఎం కవిత అన్న నినాదాలు చేయడం ఆమె తండ్రి రాజకీయ వారసురాలిగా పార్టీ పగ్గాలు చేపట్టాలని అభిలషిస్తున్నట్లు స్పష్టమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో కూడా అంటే ఆమె బెయిలుపై విడుదలై హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కూడా సీఎం కవిత అన్న నినాదాలు వినిపించాయి.  

దీనికి కౌంటర్ అన్నట్లుగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను కేటీఆర్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మద్దతు దారులు సీఎం కేటీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  ఈ సంఘటనలను బట్టి పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టే విషయంలో అన్నా చెల్లెళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ కేసీఆర్ కుటుంబంలో ఈ తగాదా ఉందనీ, కవిత, కేటీఆర్ ల మధ్య కేసీఆర్ నలిగిపోయారనీ అప్పట్లో పార్టీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది.  ఇప్పుడు కేసీఆర్ రాజకీయంగా ఇన్ యాక్టివ్ అయిన సందర్భంలో పార్టీ పగ్గాల కోసం కేటీఆర్, కవితల మధ్య పోటీ ఎంత వరకూ వెడుతుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. 

By
en-us Political News

  
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.