అలిపిరి నడక మార్గంలో మరో చిరుత

Publish Date:Sep 2, 2023

Advertisement

అలిపిరి  నడక మార్గాన్ని టీటీడీ చిరుత పులల అభయారణ్యంగా మార్చేసిందా? నడకదారి భక్తులు ఆ దారిలో వెళ్లాలంటేనే భయపడేలా పరిస్థితులను మార్చేసిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా కలియుగ వైకుంఠంగా భక్తకోటి భావించే తిరుమల పవిత్రతను మంటగలపడంతో ఊరుకోకుండా.. తిరుమల వెంకన్నను దర్శించుకునే భక్తల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా టీటీడీ అడుగులు వేస్తున్నదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చిరుత దాడిలో ఓ చిన్నారి మరణించిన సంగతి తెలిసిందే.

అంతుకు కొద్ది రోజుల ముందు చిరుత దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ రెండు సంఘటనలతో అలిపిరి కాలినడకన తిరుమల వెళ్లాలనుకునే భక్తులు ఒకటికి పది సార్లు ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడింది. చిరుత సంచారం ఉన్న ప్రాంతాలలో బోనులు ఏర్పాటు చేసి నాలుగు చిరుతను బంధించారు. భక్తులు హమ్మయ్యా అని ఊరట పొందే లోగానే మరో చిరుత సంచారాన్ని గుర్తించడంతో భక్తులలో ఆందోళన పెరిగిపోతున్నది.

 కాలిబాటలో లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు కెమేరాలలో రికార్డు కావడంతో చిరుతల భయం కాలినడక భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇటీవల చిరుత దాడిలో బాలిక మరణించిన ప్రదేశంలోనే చిరుత సంచారాన్ని గుర్తించడంతో అసలు నడక మార్గం లో భక్తుల భద్రతను టీటీడీ గాలికి వదిలేసిందా అన్న అనుమానాలు భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అలిపిరి నడకమార్గంలో నాలుగు చిరుతలను బంధించామని టీటీడీ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఆ మార్గంలో మరో చిరుత అంటే ఇది ఐదోది సంచరిస్తోందన్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయి. 

అలిపిరి నడకమార్గంలో భక్తుల రక్షణకు చేయాల్సిన ఏర్పాట్లు పూర్తిగా విస్మరించిన టీటీడీ భక్తులు తమను తామే రక్షించుకోవాలంటున్నది. ఇందు కోసం నకడమార్గంలో వెళ్లే వారికి కర్రలను సప్లై చేస్తున్నది. అంతే కాకుండా ఆ కర్రలతో చిరుతలను భయపెట్టి భద్రంగా వెళ్లండని సలహాలిస్తోంది. అయితే ఆ కర్రలు కూడా ఉచితం కాదట. ప్రతి కర్రకు రుసుం వసూలు చేస్తున్నది. కొండ కింద అలిపిరి నడక మార్గం వద్ద టీటీడీ కర్రలు అందజేస్తుంది. కొండపైకి వెళ్లగానే వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. కర్రలను అందించడం ద్వారా శ్రీవారిని నడక మార్గంలో దర్శించుకోవాలనుకునే భక్తులు కర్రసాము నేర్చుకుని మరీ రండి అని టీటీడీ చెబుతోందా అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు అలిపిరి నడక మార్గంలో సంచరిస్తున్న చిరుతల సంఖ్య ఎంత అన్న విషయాన్ని సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించి నిర్ధారించే దిశగా టీటీడీ ఏమైనా చర్యలు తీసుకుంటున్నదా?  నడకమార్గంలోకి వన్యప్రాణులు చొచ్చుకు రాకుండా కంచె  నిర్మాణం ప్రతిపాదన ఎప్పటికైనా కార్యరూపం దాలుస్తుందా? లేక కర్రలు ఇచ్చేశాం. ఇక మీ రక్షణ మీదే అంటు చేతులెత్తేసిందా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.