బ్రేకింగ్ న్యూస్: మేఘా కృష్ణారెడ్డి చేతికి మరో భారీ ప్రాజెక్టు
Publish Date:Jan 31, 2022
Advertisement
తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కూతురు పెళ్లి ఖర్చులు భరించిన ఎంఈఐఎల్ (మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) కు కేసీఆర్ సర్కారు మరో భారీ ప్రాజెక్టును కట్టబెట్టింది. గత డిసెంబర్ లో జరిగిన రజత్ కుమార్ కూతురు పెళ్లి ఖర్చులను మేఘా కృష్ణారెడ్డి ఎందుకు భరించాల్సి వచ్చిందో చెప్పాలని పలు మీడియా సంస్థలు, విపక్షాలు నిలదీస్తుండగానే అదే ఎంఈఐఎల్ కు అనుబంధం సంస్థ అయిన డ్రిల్ మెక్ కు ఇంకో ప్రాజెక్టు కట్టబెడుతూ ఒప్పందం కుదుర్చుకోవడం విమర్శలకు తావిస్తోంది.
అంతర్జాతీయ సంస్థ అయిన డ్రిల్ మెక్ కు హైదరాబాద్ లో ఈ ప్రాజెక్టును కట్టబెడుతూ ఒప్పందం కుదుర్చుకున్నారు. 200 మిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్లో గ్లోబల్ ఆయిల్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేసేందుకు ఈ డీల్ కుదిరింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో డ్రిల్ మెక్ ఎంఓయూ కుదుర్చుకుంది. డ్రిల్మెక్ సీఈవో అలెక్స్కు ఎంఓయూ కాపీని పరిశ్రమలు, ఐటిశాఖ మంత్రి కేటీఆర్ అందజేశారు. డ్రిల్మెక్ ఏర్పాటుతో కొత్తగా 4 వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని భావిస్తున్నారు. తెలంగాణ కేంద్రంగా భారీ ఆయిల్ రిగ్గులను డ్రిల్మెక్ సంస్థ తయారు చేస్తుంది. ఆ రిగ్గులను అవసరమైన చోటుకు ఎగుమతి చేసి భారీ ఎత్తున ఆదాయం పొందడమే గాక స్థానిక నిరుద్యోగ యువతకు ఎంతోకొంత ఉపాధి అవకాశాలు కల్పించాలనేది లక్ష్యం.
http://www.teluguone.com/news/content/another-big-project-to-megha-krishnareddy-39-130974.html





