Publish Date:Jun 17, 2026
తమిళనాట అన్నాడీఎంకే పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారౌతోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, తమిళనాడు మాజీ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి. విజయభాస్కర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆయన శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను స్వయంగా కలిసి అందజేశారు. ఆ రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు. విరాలిమలై నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విజయభాస్కర్ రాజీనామాతో దీంతో అన్నాడీఎంకే లో తీవ్ర కలకలం మొదలైంది.
ఈ రాజీనామా వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా పార్టీ అగ్ర నాయకత్వం, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వైఖరి పట్ల విజయభాస్కర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలోని నిజమైన, క్షేత్రస్థాయి కార్యకర్తల గళాన్ని, అభిప్రాయాలను అధిష్టానం కనీసం వినడం లేదంటూ ఆయన బహిరంగంగానే ఆరోపించారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వంపై జరిగిన అసెంబ్లీ విశ్వాస పరీక్షలో విజయభాస్కర్ పార్టీ లైన్‌ను ధిక్కరించి, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. నాటి నుంచే ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు, భవిష్యత్ ప్రయోజనాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని, త్వరలోనే తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని విజయభాస్కర్ తెలిపారు.
2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం.. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే అన్నాడీఎంకే పార్టీని వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఐదో శాసనసభ్యుడిగా విజయభాస్కర్ నిలిచారు. ఈ వరుస వలసల కారణంగా 234 మంది మొత్తం సభ్యులున్న తమిళనాడు శాసనసభలో అన్నాడీఎంకే పా బలం ఇప్పుడు 42కు పడిపోయింది. మరోవైపు, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన సీటుతో కలుపుకుని, ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఖాళీల సంఖ్య 6 కి చేరుకుంది.
ప్రస్తుత రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే, గతంలో అన్నాడీఎంకేను వీడి బయటకు వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల బాటలోనే డాక్టర్ సి. విజయభాస్కర్ కూడా అధికార టీవీకే పార్టీ తీర్థం పుచ్చుకుంటారని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/another-aiadmk-mla-resigns-25-223200.html
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.