తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. ఎక్కడంటే? ఎప్పుడంటే??

Publish Date:Jul 23, 2022

Advertisement

తెలంగాణలో త్వరలో  మరో  అసెంబ్లీ స్థానం ఖాళీ కానుందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందే మరో ఉప ఎన్నిక అనివార్యం కానుందా ? మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారెందుకు సిద్ధమయ్యారా ? అంటే, రాజకీయ వర్గాల నుంచి, అవుననే సమాధానమే వస్తోంది.

అవును, గత కొద్ది రోజులుగా నల్గొండ  జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరుతున్నారనే వార్త మీడియా, సోషల్ మీడియాలలోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లోనూ చాలా జోరుగా షికార్లు చేస్తోంది.   అయితే, ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలలో తమ కంటూ ఒక స్థానం సంపాదించుకున్న కోమటి రెడ్డి సోదరుల రాజకీయం  ఎప్పుడు మలుపు తిరుగుతుందో, వారు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పడం కష్టం.  అంతే కాదు , కోమటి రెడ్డి సోదరుల మాటల్లో వినిపించే జోరు, చేతల్లో కనిపించదని  అంటారు. నిజానికి, ఒక దశలో సోదరులు ఇద్దరూ కాంగ్రెస్ కు గుడ్ బై చెపుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

అలాగే పీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగ పడిన కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఇక జీవితంలో గాంధీ భవన్ గడప తొక్కేది లేదని శపథం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకున్నారని పరోక్షంగానే అయినా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయినా ఆ తర్వాత గాంధీ భవన్ మెట్లు ఎక్కడమే కాదు, సోనియా, రాహుల్ గాంధీ కంటి తుడుపు కానుకగా ఇచ్చిన స్టార్ క్యాంపైనర్ పదవిని కళ్ళ కద్దుకుని మరీ తీసుకున్నారు. ఆరో వెలితో సమానమైన అ పదవితోనే సంతృప్తి చెందారు, సర్దుకు పోయారు.  

ఇక రాజగోపాల రెడ్డి, విషయం అయితే చెప్పనే అక్కర లేదు. 2018 ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి, గడచిన మూడు సంవత్సరాలుగా రాజగోపాల రెడ్డి  పార్టీ మారతారనే వార్త  పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తూనే వుంది. బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకటి రెండు సందర్భాలలో ఆయనే స్వయంగా ప్రకటించారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని వార్త లొచ్చాయి. అయితే. ఇంతరవరకు ఆ దిశగా  ముందడుగు పడలేదు. ఆ ముహూర్తమూ రాలేదు. అయితే, ఈసారి అలా కాదని, నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారని అంటున్నారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిన బీజేపీ, 2023లో రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

అందులో  భాగంగానే కేంద్ర హోం మంత్రి అమిత షా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక గెలుపుతో, పార్టీకి మంరింత ఉపు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికలతో వచ్చిన ఉపును, మరో ఉప ఎన్నిక గెలుపుతో మరింత ముందుకు తీసుకు పోయే వ్యూహంలో భాగంగానే, మునుగోడును ఎంచుకున్నారని అంటున్నారు. అందుకే అమిత్ షా ఎప్పటి నుంచో బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డితో రాష్ట్ర నాయకుల ప్రమేయం  లేకుండా నేరుగా మంతనాలు జరిపారని తెలుస్తోంది. ఈ భేటీలో అమిత్ షా చాలా స్పష్టంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్దం అయితేనే బీజేపీలోకి తీసుకుంటామని రాజ గోపాల రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది.

అందుకు అంగీకరిస్తే  ఉప ఎన్నికల భారం మొత్తం పార్టీ భరిస్తుందని చెప్పడంతో పాటుగా అమిత్ షా ఉప ఎన్నికల్లో గెలుపునకు భరోసా కూడా ఇచ్చారని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ  మునుగోడుతో పాటుగా  మరో మూడు నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి, చివరకు మునుగోడు పై నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  సో .. అదే నిజం అయితే బంతి ఇప్పుడు రాజగోపాల రెడ్డి కోర్టులో ఉందని, ఆయన ఊ .. అంటే  కర్ణాటక (ముదస్తు) అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా డిసెంబర్’లో మునుగోడు ఉపేఎన్నిక ముహూర్తం ఫిక్స్ అయిపోయినట్లే అంటున్నారు.

By
en-us Political News

  
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.