అధ్యక్ష పదవి నుంచి అన్నామలై ఔట్?

Publish Date:Apr 1, 2025

Advertisement

తమిళ నాడులో బీజేపీకి ఒక గుర్తింపు వచ్చిందంటే, అందుకు కారణం ఒకేఒక్కడు. ఆ ఒక్కడు  మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత తమిళ నాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. అలాగే  కమల దళానికి రాష్ట్రంలో అంతో ఇంతో రాజకీయ విజయం దక్కిందంటే ఆ క్రెడిట్ కూడా అన్నామలై అకౌంటులోనే చేరుతుంది. అంతే కాదు  సూది మొలంత చోటు లేని రాష్ట్రంలో ఉరూరా కాషాయ జెండా ఎగురుతోందంటే అది కూడా ఆయన ఖాతాలోనే  చేరుతుంది.   

అయితే  బీజేపే పెద్దలు దక్షిణాది రాష్ట్రాలలో పొత్తులు లేకుండా పప్పులు ఉండకవనే నిర్ణయానికి వచ్చారో ఏమో కానీ, ఎఐఎడిఎంకె తో పొత్తు కోసం, అన్నమలై ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చారు. అవును  బీజేపీ నాయకులు కథలు చాలానే చెప్పా వచ్చును కానీ  ఎఐఎడిఎంకె అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి అభీష్టం మేరకే  బీజేపీ పెద్దలు అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలానే నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలో బీజేపీతో పొత్తును తెంచుకుని వెళ్ళిన ఎఐఎడిఎంకె అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి తిరిగి ఎన్డీఎ గూటికి చేరేందుకు  గత కొంత కాలంగా పావులు కదుపుతున్నారు. రాజకీయ అవసరాలతో పాటుగా ఆయనకు ఇంకేమి  రక్షణలు  అవసరం ఉన్నాయో ఏమో  కానీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన ఎన్డీఎ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఈనేపధ్యంలో  బీజేపీ అధిష్టానం  పాళని స్వామి కోసం  అన్నామలైపై వేటు వేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే  బీజేపీ పెద్దల నిర్ణయం అనూహ్యం అయితే కాదని అంటున్నారు.

నిజానికి  గతంలో ఎఐఎడిఎంకె, బీజేపీతో పొత్తును తెంచుకోవడానికి,పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగానూ అన్నామలై’ కారణం. ఇదేమీ రహస్యం కాదు, అందరికీ తెలిసిన  బహిరంగ రహస్యమే. ప్రధాన ద్రవిడ పార్టీలు డిఎంకె, అన్నా డిఎంకె, రెండూ అవినీతి విషయంలో ఒకే తాను ముక్కలని అన్నామలై అనేక సందర్భాలలో ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత, పళని స్వామి సహా ఇతర నాయకుల అవినీతి ఫైల్స్ బయట పెట్టారు. అయితే అవసరార్ధం కుదిరే పోత్తులకు అంటూ, సొంటూ ఉండదని  మహరాష్త్రలో అజిత్ పవార్  తో పొత్తు పెట్టుకున్నసందర్భంలోనే స్పష్టం చేసిన  బీజేపీ పెద్దలు తమిళ నాడులో అన్నా డిఎంకె తో  మళ్ళీ పొత్తుకు పచ్చజెండా ఊపారు.   

కొత్త పొత్తు చర్చల్లో భాగంగా  కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంలోనే పళని స్వామి పొత్తుకు అన్నామలై అడ్డవుతారని అనుమానం వ్యక్త పరిచారు. రాష్ట్ర స్థాయిలో ఉభయ పార్టీల మధ్య పొత్తు చర్చలు, సీట్ల సర్దుబాటు తదితర ఉమ్మడి వ్యవహారాలను చర్చించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని పళనిస్వామి అమిత్ షాను  కోరినట్లు వార్త లొచ్చాయి.

ఈ నేపద్యంలో  అధ్యక్ష పదవి నుంచి అన్నామలై’ తప్పుకోవడం అనూహ్యం కాదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే  అన్నా డిఎంకె తో పొత్తు కారణంగా  కుల సమీకరణలో వచ్చిన మార్పు(పళని స్వామి,అన్నామలై ఇద్దరిది ఒకే కులం) కారణంగా అన్నామలైని  అధ్యక్ష పదవి నుంచి తప్పించడం శిక్షగా భావించరాదని అంటున్నారు. మరో వంక అన్నామలై పొత్తు తనకు ఇష్టం లేదనే విషయాన్ని చెప్పకుండా  పొత్తుకు సంబంధించి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నా, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా, ఆనందంగా స్వీకరిస్తానన్నారు. అంతే కాదు సాధారణ కార్యకర్తగా పనిచేయడానికి అయినా సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.

అయితే గత అనుభవాల దృష్ట్యా, ఎఐఎడిఎంకెతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అనే విషయంలో మాత్రం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. గతంలో వాజపేయి ప్రభుత్వాన్ని ఒక్క ఓటు తేడాతో ఓడించడం మొదలు 2023లో పళని స్వామి పొత్తును ఏక పక్షంగా తెంచుకోవడం వరకు  ఎఐఎడిఎంకె’తో  బీజేపీకి చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి. అయినా పునరపి జననం పునరపి మరణం అన్నట్లు  రెండు పార్టీల ఎత్తు పొత్తులు  చస్తూ బతుకుతూ వస్తున్నాయి.ఇప్పడు ఉభయ పార్టీలు మరో మారు మరో మూడు ముళ్ళకు సిద్దమయ్యాయి. ఇది ఎన్నాళ్ళ ముచ్చటో.. ఎప్పుడు పుటుక్కు మంటుండో ఏమో కానీ, ఒక మంచి నాయకుడి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది.

By
en-us Political News

  
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.