అన్న ఎన్టీఆర్ రికార్డ్ అన్ బ్రేకబుల్!
Publish Date:Apr 24, 2026
Advertisement
ఇప్పటి వరకూ ఒక నటుడు పార్టీ పెట్టి పోటీ చేసిన తొలి ఎన్నికల్లో తెచ్చుకున్న ఓట్ల శాతం ఎంత? వీరిలో అత్యధిక ఓట్ల శాతం తెచ్చుకున్న ఆ గొప్ప నటుడు ఎవరు? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణం విజయ్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్రస్తుతం ఎన్నికల పరీక్షకు నిలపడంతో.. ఇతర నటుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నికల్లో పాల్గొన్నపుడు సాధించిన ఓట్ల శాతం ఎంత? అన్న ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. వారిలో టాప్ మోస్ట్ ఎవరని చూస్తే.. డౌటెందుకు అన్న ఎన్టీఆర్. ఇదిరా తెలుగోడి సత్తా అన్న మాట వినిపిస్తోంది. మిగిలిన వారి ఓటింగ్ శాతమెంత? ఎన్టీఆర్ సాధించిన ఓట్ షేర్ ఏమిటి అని చూస్తే.. ఎన్టీఆర్.. పార్టీ స్థాపించిన 9 నెలలలో వచ్చిన ఎన్నికలలో తొలి సారి పోటీ చేసి.. 46.30శాతంతో పార్టీని 201 స్థానాలలో గెలిపించారు. ఇక ఎంజీఆర్ తన తొలి ప్రయత్నంలో 33.52శాతంతో 130 స్థానాలు, చిరంజీవి 16.32శాతంతో 18స్థానాలనూ దక్కించుకున్నారు. ఆ తరువాత తమిళనటుడు విజయకాంత్ తన పార్టీని తొలి ప్రయత్నంలో 8.38 ఓట్ల శాతంతో శాతంతో ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించారు. ఇక జపవన్ కళ్యాణ్- 5.53శాతంతో ఒక స్థానం, కమలహాసన్- 2.52శాతంతో జీరో స్థానాలు సాధించారు. ఇక ఇప్పుడు విజయ్.. తన తొలి ప్రయత్నంలో ఎంత శాతం ఓట్లు సాధిస్తారు? ఎన్ని సీట్లలో ఆయన పార్టీ విజయం సాధిస్తుంది అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. సర్వేలను బట్టీ చూస్తే ఆయనకు 15- 19 శాతం ఓట్ షేర్ రావచ్చనీ.. ఆయన సాధించబోయే సీట్ల సంఖ్య ఓ డజను వరకూ ఉండొచ్చనీ అంటున్నారు సెఫాలజిస్టులు.
ఏది ఏమైనా ఒక నటుడు పెట్టిన పార్టీ తొలి ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం, గెలిచిన సీట్ల సంఖ్యలో ఇప్పటి వరకూ ఎన్టీఆరే టాప్. ఇది మరో నటుడికి ఎప్పటికీ సాధ్యం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్టీఆర్ ఆల్ టైం గ్రేట్ రికార్డ్ ని బ్రేక్ అయ్యే అవకాశాలే లేవని విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/anna-ntrs-record-is-unbreakable-25-218143.html





