Publish Date:Apr 19, 2026
ఏపీలో అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. అన్న క్యాంటీన్ల సేవలు ఎంతో మన్నన పొందాయని...లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వహించడం గొప్ప విషయం అని భువనేశ్వరి అభిప్రాయ పడ్డారు. రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో ప్రభుత్వం గౌరవంగా పేదలకు భోజనం అందిస్తోందని అమె అన్నారు. ఏప్రిల్ 20వ తేదీన సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి రూ.76 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చెక్ ను అన్న క్యాంటీన్ సీఈవోకు అందించారు. చంద్రబాబు జన్మదినం అయిన ఏప్రిల్ 20న రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందించాలని భువనేశ్వరి కోరారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకు కడపు నింపే అన్న క్యాంటీన్లకు విరాళం ఇవ్వడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని భువనేశ్వరి తెలిపారు. అత్యంత పరిశుభ్రమైన వాతారణంలో అన్న క్యాంటీన్లలో పౌష్టికాహారం అందించడం గొప్ప విషయం అని ఆమె అభిప్రాయ పడ్డారు.
రోజువారీ కూలీలు, పేదలు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ది పొందుతున్నారని...ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని భువనేశ్వరి అన్నారు. అన్న క్యాంటీన్లకు ఆర్థికంగా చేయూతనిచ్చి స్ఫూర్తి నింపేందుకు అంతా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే సంతృప్తి ఏముంటుదని వ్యాఖ్యానించిన భువనేశ్వరి....తాను పలు సందర్భాల్లో అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కలిగిన సంతృప్తిని, ప్రజల స్పందనను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
తమ మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా 12 ఏళ్లుగా ప్రతీ ఏటా తిరుమలలో అన్న ప్రసాదానికి రూ.44 లక్షలు విరాళంగా ఇస్తున్న విషయాన్ని ఆమె ప్రస్థావించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నారా భువనేశ్వరి....అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఈ ఏడాది మీ పుట్టిన రోజుకు మేమిచ్చే బహుమానం అంటూ వ్యాఖ్యానించారు. తన పేరు మీద అన్న క్యాంటీన్లకు ఒక రోజు అన్నదానానికి రూ.76 లక్షల విరాళం ఇచ్చిన తన సతీమణి భువనేశ్వరిని ముఖ్యమంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... “రాష్ట్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ఒక గొప్ప కార్యక్రమంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. తిరుమలలో భక్తుల సహకారంతో 4 దశాబ్దాలుగా అన్నదానం జరుగుతోంది. అలాగే ప్రముఖ దేవాలయాల్లోనూ అన్నదానం నిర్వహిస్తున్నాం. పేదలకు రూ.5 లకే కడుపునింపే అన్న క్యాంటీన్ సేవలను మరింత విస్తరించాలి. నాణ్యతను పాటించడంతో పాటు..పవిత్రంగా, గౌరవంగా, పరిశుభ్రంగా ఆహారం అందించే ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలి. పుట్టిన రోజు, పెళ్లి రోజు సహా తమకు నచ్చిన రోజు భోజనాలకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలి. ఇదొక స్ఫూర్తి దాయకమైన కార్యక్రమంగా మారి బ్రాండ్ ను సృష్టించాలి' అని చంద్రబాబు అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anna-canteen-services-36-217736.html
మే 8న హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. మే 16వ తేదీన భగీరథ్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అంటే దాదాపు 45 రోజులకు పైగా అతడు చర్లపల్లి జైలులోనే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
తమ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నందుకు ప్రతీకారంగానే పాక్ సైనిక కేంద్రాలపై దాడులు చేస్తున్నామని బలూచ్ రెబల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సైన్యంపై మరిన్ని భారీ ఎత్తున దాడులు చేస్తామని స్పష్టం చేశాయి.
తంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఖాసిం సులేమానీ మతికి ప్రతీకారంగా ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఎత్తుగడలు వేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ నివేదికలు, రక్షణ రంగ తాజా విశ్లేషణల మేరకు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాల జాబితాలో భారత్ మూడవ స్థానానికి దూసుకెళ్లింది. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలవగా, అత్యాధునిక యుద్ధ పరిజ్ఞానం కలిగిన రష్యా రెండో స్థానంలో ఉంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఇప్పటివరకు మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చిన చైనాను అధిగమించి ఇండియా ఈ ఘనత సాధించింది.
స్టాక్ మార్కెట్లో సరైన ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేసి ₹2 లక్షలు ఎలా పోగొట్టుకున్నానో ఈ వెబ్ స్టోరీలో చూడండి. కొత్త ఇన్వెస్టర్లు ఫోమో FOMO, స్టాప్ లాస్ లేకపోవడం వంటి ఏ తప్పులు చేయకూడదో మరియు రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల FII 60 బిలియన్ డాలర్ల అమ్మకాల సునామీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. ముడి చమురు ధరల తగ్గుదలతో మారిన మార్కెట్ సమీకరణాలు మరియు దేశీయ ఇన్వెస్టర్ల రికార్డు కొనుగోళ్లపై పూర్తి విశ్లేషణ.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తొలిసారి అధికారికంగా కరూర్ జిల్లాలో పర్యటించనున్నారు. గతేడాది జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ పత్రాలను అందజేయడంతో పాటు, నూతన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కేవలం 4 నెలల్లోనే 140 శాతం పెరిగి, 3 రోజుల్లో 18 శాతం లాభంతో సరికొత్త రికార్డు సృష్టించిన స్మాల్‌క్యాప్ ఏరోస్పేస్ స్టాక్ ఏక్వస్ (Aequs) గురించిన పూర్తి వివరాలు, భవిష్యత్ టార్గెట్ ధరలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పాత ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాలన్నీ ఇక్కడికే మారాయి. ప్రయాణ సమయం, దూరం, టెర్మినల్ అప్‌డేట్స్ మరియు విమానయాన సంస్థలు జారీ చేసిన కీలక జాగ్రత్తల పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
స్విగ్గీ మరియు ఎటర్నల్ షేర్లు 7 శాతం వరకు భారీగా పెరిగాయి. విదేశీ పెట్టుబడుల వాటా 50 శాతం కంటే తగ్గడం మరియు క్విక్ కామర్స్ మార్జిన్ల బూస్ట్ అవకాశాలపై బ్రోకరేజ్ సంస్థల లేటెస్ట్ రేటింగ్స్, టార్గెట్ ధరల పూర్తి వివరాలు మీకోసం.
భారతదేశంలోని మహిళా సంక్షేమ పథకాలతో లబ్ధిదారుల బ్యాంకు బ్యాలెన్స్ 84% పెరిగింది. మహారాష్ట్ర లాడ్కీ బహిన్ , ఒడిశా సుభద్ర యోజన పథకాల వల్ల నెలవారీ ఖర్చులు, యూపీఐ డిజిటల్ లావాదేవీలు మరియు కుటుంబ ఆర్థిక స్థిరత్వం ఎలా పెరిగాయో EAC PM తాజా నివేదిక ఆధారంగా తెలుసుకోండి.
భారత్ vs ఇంగ్లాండ్ 4వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. సంజు శాంసన్ రీఎంట్రీ ఇస్తుండగా, తిలక్ వర్మ మరియు వైభవ్ సూర్యవంశీ అవుట్ కానున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వాతావరణ అప్‌డేట్స్, ట్రాఫిక్ జామ్స్ మరియు వర్షపాతం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.