విజయసాయికి జైల్లో పళ్లాలు కడిగే కాంట్రాక్ట్ జాబ్‌!

Publish Date:Apr 16, 2022

Advertisement

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నాయకుల్లో విజయసాయిరెడ్డి ఒకరు. ఆయన ఏం చెప్పాలనుకున్నా.. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆ క్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. దీనిపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. అందుకు ప్రతిగా విజయసాయిరెడ్డికి అనిత ట్విట్టర్ వేదికగా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

విజయసాయిరెడ్డి.. ఆదివారం అంటే ఏప్రిల్ 17వ తేదీన తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లను విజయసాయిరెడ్డి స్వయంగా పర్యవేక్షించి.. అందుకు సంబంధించిన ఫొటోలతోపాటు.. ఇంకో 10 నెలల్లో ఎమ్మెల్సీ పదవి కోల్పోతున్న నారా లోకేశ్ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు... కానీ ఈ జాబ్ మేళలో 72 ఏళ్ల వయస్సు ఉన్న చంద్రబాబుకు జాబ్ ఇవ్వడం కుదరదు.. రిటైర్ కావాల్సిందేనంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు.  

దీనిపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. ఘాటుగా స్పందించారు.  నీ రాజ్యసభ సభ్యత్వం ఇంకో 2 నెలల్లో పొతుందిగా ఏ2? చంచల్ గూడలో పళ్లాలు కడిగే కాంట్రాక్ట్ ఉద్యోగానికి ట్రై చేస్కో.. మా నాయకుడి వయస్సు గురించి మాట్లాడుతున్నావ్.. నువ్వేమన్నా నవయువకుణ్ని అనుకుంటున్నావా ముసలి నక్కా? మా నాయకుడు మిమ్మల్ని అందరిని రిటైర్ చేయించే రోజు త్వరలోనే ఉందంటూ విజయసాయిరెడ్డికి అనిత.. గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.


 

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
సంతానం కలగలేదన్న కారణంతో భార్యను తప్పుబడుతూ విడాకులు కోరలేరని మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.