అజ్ణానం.. అజ్ణాతం.. మళ్లీ ప్రత్యక్షం.. అనిల్ కుమార్ యాదవ్ తీరు అయోమయం!

Publish Date:Apr 23, 2025

Advertisement

అనీల్ కుమార్ యాదవ్.. పరిచయం అక్కర్లేని పేరు. జగన్ హయాంలో ఓళ్లూపై తెలియకుండా మాట్లాడి, తొడకొట్టి సవాళ్లు విసిరి పాపులర్ అయ్యారు. ప్రత్యర్థులపై నోరెట్టుకుని పడిపోవడమే రాజకీయం అన్నట్లుగా అప్పట్లో ఆయన వ్యవహార శైలి ఉండేది. ఆ తీరు కారణంగానే జగన్ కు దగ్గరయ్యారనీ చెబుతుంటారు. సరే అది పక్కన పెడితే వైసీపీ ఘోర పరాజయం తరువాత అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. మౌనంగా మాయమైపోయారు.  

వైసీపీ అధికారంలో ఉండగా కన్నూమిన్నూ గానక ఇష్టారీతిగా  తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైనోరెట్టుకు పడిపోయిన అనీల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. పోలింగ్ జరిగిన తరువాత ఒక సారి మీడియా ముందుకు వచ్చి పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించారని ఓ ఆరోపణ చేసి ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించేశారు.  ఆ తరువాత ఆయన ఇక ఎక్కడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే  పార్టీ అధికారంలో ఉండగా, తాను మంత్రిపదవి వెలగబెడుతున్న సమయంలో అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా లో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు.

నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి  బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్  అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందని చెప్పారు. ఒక వేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు. ఇప్పుడు తన రాజకీయ జీవితమే సందిగ్ధంలో పడిన నేపథ్యంలో ముఖం చూపలేక చాటేశారు.

 విపక్షంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అనీల్ కుమార్ యాదవ్ అక్రమాలపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేసింది. ఇప్పుడు అధకారంలోకి రాగానే విచారణకు ఆదేశించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇలా ఎలా చూసినా చిక్కుల సుడిగుండంలో చిక్కుకున్న అనీల్ కుమార్ యాదవ్ ఏ కలుగులో దాక్కొన్నా బయటకు లాక్కొచ్చి చట్టం ముందు నిలబెట్టడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తనను తాను కాపాడుకోవడం ఎలాగో తెలియక అనిల్ కుమార్ యాదవ్ అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశాలున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అధికారంలో ఉన్న సమయంలో స్థాయి మరిచి.. ఇష్టారీతిగా తెలుగుదేశం, జనసేన అధినాయకులపై అనిల్ కుమార్ చేసిన అనుచిత విమర్శలు, వ్యాఖ్యల కారణంగా ఆ రెండు పార్టీలలోనూ అవకాశం లేకపోయింది. దీంతో అనివార్యంగా ఆయన ఇటు వైసీపీకి దూరమై, అటు మరో పార్టీ అండ లేకుంటే కేసులను తట్టుకోవడం సాధ్యం కాదని భావించి గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ జగన్ పంచన చేరి పబ్బం గడుపుకోవాలన్న నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు అంటున్నారు. అందుకు ఉదాహరణగా నిన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశానికి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావడాన్ని చూపుతున్నారు. మొత్తం మీద అజ్ణానం నుంచి అజ్ణాతంలోకి అక్కడ నుంచి మళ్లీ జగన్ పంచకు చేరిన అనిల్ కుమార్ ప్రస్తతం తన భవిష్యత్ ఏమిటన్న అయోమయంలో ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. 

By
en-us Political News

  
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.