ఇస్లాంలో కోపం నిషిద్దం
Publish Date:Sep 6, 2024
Advertisement
జాఫర్ కు నలుగురు అన్నదమ్ములు . జాఫర్ దుబాయ్ లోనే డ్రైవర్ ఉద్యోగం చేసేవాడు. ఆర్థికంగా చితికిపోయిన జాఫర్ అన్నదమ్ములు వారసత్వంగా వచ్చిన ఇల్లును విక్రయించాలనుకుంటారు. జాఫర్ కొడుకు సిరాజ్ ఆ ఇల్లును తనకే అమ్మాలని కండిషన్ పెట్టాడు. డబ్బులు ఎవరు ఇస్తారో వారికే విక్రయిస్తామని అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు. జాఫర్ కు వచ్చే భాగాన్ని వదిలేసి మిగతా ముగ్గురు అదే బస్తీలో ఉన్న ఖాన్ కు విక్రయించాలనుకుంటారు. సిరాజ్ వారిని వేధించడంతో అదే బస్తీలో పేరు గడించిన మౌలానా దగ్గరికి చేరుకున్నారు. ఇస్లాంలో కోపానికి తావు లేదు. అల్లాను సంతోషపరచడమే నేర్చుకోవాలి. జన్నత్(స్వర్గం), జహన్నమ్(నరకం) రెండుమార్గాల చాయిస్ ఇచ్చేశాడు. మనమే చాయిస్ ఎంచుకోవాలి. కోపం కూడా మంచిదే కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. గుర్రం మీద స్వారీ చేయడం ఆనందంగా ఉంటుంది కానీ నేర్పుతో గుర్రపు స్వారీ చేయాలి. గుర్రానికి ట్రయినింగ్ అవసరం. ట్రయినింగ్ వల్ల గుర్రం మీద కూర్చొని గమ్య స్థానాలకు చేరుకోగలం. అదే విధంగా కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే జీవితమనే గుర్రం మీద స్వారీ చేయగలం. చాలామంది నిత్యం కోపం ప్రదర్శిస్తారు. కోపం తెచ్చుకోవడం అంటే మనల్ని మనం దహనం చేసుకోవడమే. ఓపిక, సహనం ఇస్లాంలో అతిముఖ్యమైన లక్షణాలు. నబీ కోరుకున్నది కూడా ఇదే. ఎవరు స్వర్గానికి వెళతారు ఎవరు నరకానికి వెళతారో తెలియదు కానీ వారికుండే లక్షణాలే స్వర్గ,నరక ద్వారాలను నిర్ణయిస్తాయి. ఐదుసార్లు ప్రతిరోజు నమాజు చేయడం స్వర్గానికి వెళ్లే మొదటిమెట్టు. నా తమ్ముడుకి కోపం వస్తే ఊరుకోడు. నేను మాత్రమే కంట్రోల్ చేయగలను అని ఇటీవల తెలంగాణకు చెందిన పార్లమెంటుసభ్యుడు ఒకరు గొప్పలు చెప్పుకున్నాడు. ఒక్క పార్లమెంటు సభ్యుడు మాత్రమే కాదు యువత ఎక్కువగా ఈ డైలాగ్ ను గొప్పగా చెప్పుకుంటున్నారు. కోపం అనేది నెగెటివ్ పదం. కోపాన్ని కూడా అదేదో ఆభరణంగా అలంకరించుకోవడం అంత మూర్ఖత్వం మరోటి లేదు. కోపం వల్ల వ్యక్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో తిట్లకు కొరత లేదు. కోపంగా ఎవరైనా అరిస్తే సైలెంట్ గా ఉండిపోవాలి. ఆ తిట్లన్నీ ప్రకృతిలోని పంచభూతాల్లోకి వెళ్లిపోతాయి. ప్రతిగా మనకు కోపం వస్తే దెబ్బతినేది మన ఆరోగ్యమే. కోపం అనేది మన కంట్రోల్ లో ఉండాలి. కోపం కంట్రోల్ లో మనం ఉండకూడదు. -బదనపల్లి శ్రీనివాసాచారి
సిరాజ్ బాధితులు: సలాం వాలేకుం మౌలానాసాబ్
మౌలానా: వాలేకుం సలాం భాయ్ ఆయియే క్యాబాత్ హై బహుత్ దిన్ కే బాద్
సిరాజ్ బాధితులు: జీ మౌలానా సాబ్ . సిరాజ్ గుస్సాకా షికార్ బన్ గయే హమ్. ఘర్ మే హమారే ఇస్సా బేచ్ నే నైదేరా. జాఫర్ బయ్ కే ఇస్సా చోడ్ కే బేచ్ నే జారే. ఫిర్ బీ జాఫర్ బాయ్ కా బేటా సిరాజ్ బేచ్ నే నైదేరా. హర్ దిన్ గాలి దేరా ..కుచ్ నా కుచ్ రాస్తా బతాయియే .
సమాజంలో ఉన్న పలుకుబడి ఉన్న వ్యక్తులకు కోపం ఎక్కువగా వస్తుంది. వారికున్న ఈగో సమస్య వల్ల ఎవరైనా తిడితే భరించలేరు. నన్ను చాలామంది మౌలానా మీరు చాలా గొప్ప వ్యక్తి అంటారు. ప్రశంసల వల్ల వ్యక్తిలో ఈగో వచ్చేస్తుంది. ఇది ప్రమాదకరం. కోపం రాకుండా ఉండాలంటే సరైన నిద్ర అవసరం. నేను నిర్వహిస్తున్న మదర్సాలో విద్యార్థులు ఏడెనిమిదిగంటలు నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. కోపం వల్ల బద్దకం వస్తుంది. బద్దకం ఉంటే వ్యక్తి నమాజు కూడా చేయలేడు. నమాజు చేయడం వల్ల అల్లా సంతోషిస్తాడు. గుస్సా అల్లాకే తరఫ్ సే నియమిత్ హై అంటూ మౌలానా వివరించాడు. సిరాజ్ కోపంతో తిట్టిన తిట్లకు స్పందిచకపోవడమే మంచిది అని మౌలానా హితవు పలికారు.
http://www.teluguone.com/news/content/anger-is-forbidden-in-islam-39-184376.html