ఇస్లాంలో కోపం నిషిద్దం

Publish Date:Sep 6, 2024

Advertisement

జాఫర్ కు నలుగురు అన్నదమ్ములు . జాఫర్ దుబాయ్ లోనే డ్రైవర్ ఉద్యోగం చేసేవాడు. ఆర్థికంగా చితికిపోయిన జాఫర్ అన్నదమ్ములు వారసత్వంగా వచ్చిన ఇల్లును విక్రయించాలనుకుంటారు. జాఫర్ కొడుకు సిరాజ్ ఆ ఇల్లును తనకే అమ్మాలని కండిషన్ పెట్టాడు. డబ్బులు ఎవరు ఇస్తారో వారికే విక్రయిస్తామని అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు. జాఫర్ కు వచ్చే భాగాన్ని వదిలేసి మిగతా ముగ్గురు అదే బస్తీలో ఉన్న ఖాన్ కు విక్రయించాలనుకుంటారు. సిరాజ్ వారిని వేధించడంతో అదే బస్తీలో పేరు గడించిన మౌలానా దగ్గరికి చేరుకున్నారు. 


సిరాజ్ బాధితులు: సలాం వాలేకుం మౌలానాసాబ్ 
మౌలానా: వాలేకుం సలాం భాయ్ ఆయియే క్యాబాత్ హై బహుత్ దిన్ కే బాద్ 
సిరాజ్ బాధితులు: జీ మౌలానా సాబ్ . సిరాజ్  గుస్సాకా షికార్ బన్ గయే  హమ్.  ఘర్ మే  హమారే ఇస్సా  బేచ్ నే నైదేరా. జాఫర్ బయ్ కే ఇస్సా చోడ్ కే బేచ్ నే జారే. ఫిర్ బీ  జాఫర్ బాయ్ కా  బేటా  సిరాజ్ బేచ్ నే నైదేరా. హర్ దిన్ గాలి దేరా ..కుచ్ నా కుచ్ రాస్తా బతాయియే .

ఇస్లాంలో కోపానికి తావు లేదు. అల్లాను సంతోషపరచడమే నేర్చుకోవాలి.  జన్నత్(స్వర్గం), జహన్నమ్(నరకం) రెండుమార్గాల చాయిస్ ఇచ్చేశాడు. మనమే చాయిస్ ఎంచుకోవాలి. కోపం కూడా మంచిదే కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. గుర్రం మీద  స్వారీ  చేయడం ఆనందంగా ఉంటుంది  కానీ నేర్పుతో గుర్రపు స్వారీ చేయాలి. గుర్రానికి ట్రయినింగ్ అవసరం. ట్రయినింగ్ వల్ల గుర్రం మీద కూర్చొని గమ్య స్థానాలకు చేరుకోగలం. అదే విధంగా కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే జీవితమనే గుర్రం మీద స్వారీ చేయగలం. చాలామంది నిత్యం కోపం ప్రదర్శిస్తారు. కోపం తెచ్చుకోవడం అంటే మనల్ని మనం దహనం చేసుకోవడమే. ఓపిక, సహనం ఇస్లాంలో అతిముఖ్యమైన లక్షణాలు. నబీ కోరుకున్నది కూడా ఇదే. ఎవరు స్వర్గానికి వెళతారు ఎవరు నరకానికి వెళతారో తెలియదు కానీ వారికుండే లక్షణాలే స్వర్గ,నరక ద్వారాలను నిర్ణయిస్తాయి. ఐదుసార్లు ప్రతిరోజు నమాజు చేయడం స్వర్గానికి వెళ్లే మొదటిమెట్టు. నా తమ్ముడుకి కోపం వస్తే ఊరుకోడు. నేను మాత్రమే కంట్రోల్ చేయగలను అని ఇటీవల తెలంగాణకు చెందిన పార్లమెంటుసభ్యుడు ఒకరు గొప్పలు చెప్పుకున్నాడు. ఒక్క పార్లమెంటు సభ్యుడు మాత్రమే కాదు  యువత ఎక్కువగా ఈ డైలాగ్ ను గొప్పగా చెప్పుకుంటున్నారు. కోపం అనేది నెగెటివ్ పదం. కోపాన్ని కూడా అదేదో ఆభరణంగా అలంకరించుకోవడం అంత మూర్ఖత్వం మరోటి లేదు. కోపం వల్ల వ్యక్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో తిట్లకు కొరత లేదు. కోపంగా ఎవరైనా అరిస్తే సైలెంట్ గా ఉండిపోవాలి. ఆ తిట్లన్నీ ప్రకృతిలోని పంచభూతాల్లోకి వెళ్లిపోతాయి.  ప్రతిగా మనకు కోపం వస్తే దెబ్బతినేది మన ఆరోగ్యమే.  కోపం అనేది మన కంట్రోల్ లో ఉండాలి. కోపం కంట్రోల్ లో మనం ఉండకూడదు.
సమాజంలో ఉన్న పలుకుబడి ఉన్న వ్యక్తులకు కోపం ఎక్కువగా వస్తుంది. వారికున్న ఈగో సమస్య వల్ల ఎవరైనా తిడితే భరించలేరు. నన్ను చాలామంది మౌలానా మీరు చాలా గొప్ప వ్యక్తి అంటారు. ప్రశంసల వల్ల వ్యక్తిలో ఈగో వచ్చేస్తుంది. ఇది ప్రమాదకరం. కోపం రాకుండా ఉండాలంటే సరైన నిద్ర అవసరం. నేను నిర్వహిస్తున్న మదర్సాలో విద్యార్థులు  ఏడెనిమిదిగంటలు నిద్రపోవాలి.  క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. కోపం వల్ల బద్దకం వస్తుంది. బద్దకం ఉంటే వ్యక్తి నమాజు కూడా చేయలేడు. నమాజు చేయడం వల్ల అల్లా సంతోషిస్తాడు.   గుస్సా అల్లాకే  తరఫ్ సే నియమిత్ హై  అంటూ మౌలానా వివరించాడు. సిరాజ్ కోపంతో తిట్టిన తిట్లకు స్పందిచకపోవడమే మంచిది అని మౌలానా హితవు పలికారు.

-బదనపల్లి శ్రీనివాసాచారి 

By
en-us Political News

  
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. అంతే వెంటనే ఆయనను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
చైనా దేశ ఫైనాన్షియల్ క్యాపిటల్ నగరం షాంఘైను భారీ తుఫాను బెబింకా టైఫూన్ బెంబేలెల్తిస్తోంది. గత 70 సంవత్సరాలతో పోలిస్తే ఇదే అతి పెద్ద తుఫాను అని చైనా వాతావరణ శాఖ చెబుతోంది.
 తెలంగాణ సచివాలయం దగ్గర మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గాంధీ కుటుంబం దేశానికి చేసిన త్యాగాలు మరువలేనివని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు.
లక్ష్మీపార్వతి అలిగారు.. బుంగమూతి పెట్టుకున్నారు. జగన్ తనను చిన్నచూపు చూస్తున్నారని హర్టయ్యారు.
వైసీపీలో మంచి వాగ్ధాటి ఉన్న నాయకులలో మాజీ మంత్రి బుగ్గన ముందు వరుసలో ఉంటారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా అంటే జగన్ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా బుగ్గన పీఏపీ చైర్మన్ గా వ్యవహరించారు.
పని చేయాలన్న చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉండాలే కానీ.. ప్రభుత్వాలు అద్భుతాలు చేయవచ్చునని ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రుజువు చేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ జెండా పీకేయడానికి రెడీ అయిపోయారా? వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఇక లాంఛనమేనా? అన్న అనుమానాలు గత కొంత కాలంగా రాజకీయ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్నాయి.
అధికారులు అధికారంలో ఉన్న వారితో అంటకాగి.. వారి కోసం అడ్డగోలు పనులు చేస్తే పర్యవసానం అనుభవించక తప్పదని పలు మార్లు రుజువైంది. తాజాగా కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ కూడా ఆ అధికారులు నిబంధనలను పట్టించుకోకుండా ఏలిన వారి కళ్లల్లో ఆనందం చూడడమే తమ జన్మకు సార్థకత అన్నట్లు ప్రవర్తించిన కారణంగానే ఇప్పుడు సస్పెన్షన్ కు గురయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని   ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సోమవారం కలిసారు. సిఎంరిలీఫ్ పండ్ కు 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
ప్రముఖ కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదైంది.   తమను లైంగికంగా వేధిస్తున్నాడని జూనియర్ డ్యాన్సర్(21) ఒకరు  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఢీషో ద్వారా టాలివుడ్ లో అడుగుపెట్టటిన  కొరియాగ్రాఫర్ అనతి కాలంలో మంచి గుర్తింపు పొందారు అగ్రహీరోలకు కొరియాగ్రాఫర్ గా పని చేశాడు.
గణేష్ ఉత్సవాలను వేడుకగా నిర్వహించిన అనంతరం గణేషుడి లడ్డూ వేలం వేయడం అన్నది ఆనవాయితీగా వస్తున్నది. కమ్యూనిటీలలోనూ, వీధులలోనూ, వాడవాడలా గణేష మంటపాలు ఏర్పాటు చేసి గణేష్ చతుర్ది నుంచి 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన తరువాత గణేష నిమజ్జనం జరుగుతుంది. ఆ నిమజ్జనానికి ముందు మండపాలలో గణేషుని లడ్డూ వేలం వేయడం అన్నది ఆనవాయితీ.
ఈనెల 20వ తేదీతో వంద రోజులు పూర్తవుతుంది. ఈ వందరోజుల పాటు ఏయే ఎమ్మెల్యే ఎలాంటి పనితీరు కనబరిచారు అనే అంశం మీద వారి దగ్గర్నుంచే చంద్రబాబు సమాచారం తీసుకుని, రివ్యూ చేయబోతున్నారు.
కొంతమంది మోసపోవడానికే పుడతారు. పెద్దగా చదువుకోనివారి కంటే, బాగా చదువుకుంటున్నాం... బోలెడంత సంపాదిస్తున్నాం... మోడ్రన్‌గా జీవిస్తున్నాం అంటూ బిల్డప్ ఇచ్చేవారే గోతిలో పడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.