ఛత్తీస్‌ఘడ్‌లో మందుపాతర పేలి.. ముగ్గరు జవాన్ల మృతి
Publish Date:May 2, 2026
Advertisement
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర తొలగిస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి ముగ్గురు జవాన్లు మరణించారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం. గతంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) బృందం మైన్ల తొలగింపు ఆపరేషన్ చేస్తోంది. శనివారం (మే 2) మైన్ల తొలగిస్తుండగా ప్రమాదవశాత్తూ ఐఈడీ పేలింది. దీంతో నలుగురు డీఆర్జీ జవాన్లు తీవ్రంగా గాయపడగా.. వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
http://www.teluguone.com/news/content/andmine-blast-in-chhattisgarh-36-218836.html





