Publish Date:Mar 27, 2025
ఆంధ్రప్రదేశ్ లో నేరాల అదుపునకు, నియంత్రణకు అత్యాధునిక టెక్నాలజీని సమర్ధంగా వినియోగిస్తున్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ లో నేరాలను అదుపు చేయడమే కాక, నియంత్రించవచ్చని పదే పదే చెబుతూ వస్తున్నారు. దీంతో పోలీసు శాఖ ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నేరాలను అదుపు చేస్తున్నది.
గంజాయి సాగును గుర్తించడంలో ఇప్పటికే డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఇప్పుడు.. పేకాటరాయుళ్లను అదుపు చేయడానికి కూడా డ్రోన్లను ఉపయోగిస్తోంది. అత్యంత రహస్యంగా చతుర్ముఖ పారాయణంలో మునిగిపోయిన పేకాటరాయుళ్లను డ్రోన్ సహాయంతో గుర్తించి పోలీసులు అదుపులోనికి తీసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది. ఈ వీడియోను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం (మార్చి 27) సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వెంటనే ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది.
లక్షలాది మంది వీక్షించారు. పోలీసు శాఖ డ్రోన్ లను నేరాల అదుపులో వినియోగించుకుంటున్న తీరును ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఆ వీడియో ప్రకారం విజయనగరంలోని ఓ మారుమూల ప్రాంతంలోవాహనాల గ్యారేజీని వేదికగా చేసుకుని ఓ లారీలో కూర్చుని పేకాట ఆడుతున్న వారిని డ్రోన్ సహాయంతో గుర్తించిన పోలీసులు అతి తేలికగా వారున్న ప్రదేశానికి చేరుకుని లారీ ఎక్కి మరీ పేకాట రాయుళ్లను అదుపులోనికి తీసుకున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని నేరాల అదుపు చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందనడానికి ఇదే తార్కాణంగా నెటిజనులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/andhrapradesh-police-use-frone-technology-to-control-crime-25-195085.html
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.