తిరుపతికి పవన్ కల్యాణ్..తొక్కిసలాటలో గాయపడిన వారికి పరామర్శ

Publish Date:Jan 9, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం (జనవరి 9) మధ్యాహ్నం తిరుపతి వెళ్లనున్నారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఈ దుర్ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు తిరుపతి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య, ఆరోగ్య శాఖకు సూచించిన పవన్ కల్యాణ్ బాధితులను స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పాలని నిర్ణయించుకున్నారు.  

By
en-us Political News

  
తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి చంద్రబాబు నలుగురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. తిరుపతి ఎస్పీపై, జాయింట్ కమిషనర్ పై బదలీ వేటు వేశారు.
హైదరాబాద్ శివారు నార్సింగి మున్సిపాలిటీ, ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్లక్ష్యంగా పడి ఉన్న రాష్ట్రకూటుల కాలపు నంది విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.
ఉత్తర భారతం చలికి గజగజలాడుతోంది. తీవ్రమైన చలిగాలులకు తోడు పొగమంచుతో జనం నానా ఇబ్బందులూ పడుతున్నారు. దేశ రాజధాని నగరాన్ని మరో సారి కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడపోయింది.
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్‌పై దాడి కేసులో తనను అరెస్ట్ చేయొద్దని, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన కొన్ని రోజుల కిందట సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి కెటీఆర్ సుప్రీం గడపదొక్కే అవకాశాలున్న సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం కెవియట్ దాఖలు చేసింది. కెటీఆర్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
సామాన్యుడిగా మొదలై, అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావు. ఆ పేరు తలుచుకోగానే ఎవరికైనా చటుక్కున గుర్తుకు వచ్చేది ఆయన జగదేక సుందర రూపం. ఆయన ఒక నవ నవోన్మేష చైతన్య స్వరూపం .
తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు  సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నేరుగా ఘటనా స్థలికి చేరుకోబోతున్నారు.
అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌, కాలిఫోర్నియా ప్రాంతాలను కార్చిచ్చు కాల్చేస్తున్నది. దక్షిణ కాలిఫోర్నియాలోని అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు లాస్ ఏంజిల్స్‌ నగరానికి విస్తరించాయి. ఈ దావాలనం నివాస ప్రాంతాలకూ వ్యపించడంతో ఐదుగురు ఆహుతయ్యారు.
టాలీవుడ్ ఒత్తిడికి రేవంత్ సర్కార్ తలొగ్గింది. తాను అధికారంలో ఉన్నంత వరకూ కొత్త సినిమాల విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ప్రశక్తే ఉండదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గారు.
 ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితుడైన ఐఏఎస్ అధికారి గురువారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల  ఎదుట  విచారణకు హాజరయ్యారు.  ఆర్ బిఐ అనుమతి తీసుకోకుండానే విదేశీ సంస్థకు 55 కోట్ల రూపాయల నిధులు బదిలీచేసినట్టు అరవింద్ కుమార్ పై ఆరోపణలున్నాయి
తెలంగాణ నుంచి తమ బ్రాండ్ బీర్లను ఉపసంహరించుకుంటున్నట్లు యునైటెడ్‌ బ్రూవరీస్ లిమిటెడ్ ప్రకటించింది. అంటే ఇక నుంచి ఆ కంపెనీ తెలంగాణకు తమ ఉత్పత్తులను సరఫరా చేయదు. యునైటెడ్ బ్రూవరీస్ నుంచి తెలంగాణకు బీర్ల సరఫరా నిలిచిపోనుందన్నమాట.
ఫార్ములా ఈ రేస్ కేసులో తన తప్పేమీ లేదనీ, తాను సుద్దపూసననీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఎంత గట్టిగా చెబుతున్నా.. వేళ్లన్నీ మాత్రం ఆయనవైపే చూపుతున్నాయి.
తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్విమ్స్ సూపరింటెండెంట్ రవి కుమార్ వెల్లడించారు. క్షతగాత్రులందరికీ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.