Publish Date:Mar 16, 2025
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం (మార్చి 17) మధ్యాహ్నం భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశంలో అమరావతి పనులు సహా పలు కీలక నిర్ణయాలకు, బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ లో పెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేస్తుంది.
అదే విధంగా ఇప్పటికే సీఆర్డీయే ఆమోదం తెలిపిన అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. 22 వేల 607 కోట్ల రూపాయలతో 22 పనులకు సీఆర్డీయే ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ పనులకు ఇప్పుడు కేబినెట్ పచ్చ జెండా ఊపుతుంది. వీటితో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించి ఓకే చేయనుంది. అదే విధంగా సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన టెండర్ల పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. క్యాబినెట్ అమోదం తెలిపిన తరువాతే టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లను సీఆర్డీయే జారీ చేయాల్సి ఉంటుంది.
అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15081 కోట్ల విలువైన 37 పనులకు, అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయిoపులకు కూడా కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశం ఉ:ది. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ , దాల్మియా సిమెంట్స్, లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్, ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రాష్ట్రంలో చేయనున్న ఇన్ వెస్ట్ మెంట్లకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేస్తుందని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/andhra-pradesh-cabinet-greensignal-to-amarawathi-25-194491.html
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.