ఏపీ కాబినెట్ పునర్‌ వ్యవస్థీకరణ.. ఎప్పుడంటే?

Publish Date:Mar 11, 2022

Advertisement

ఇంతవరకు, ఎందరో ఆశావహులు, వేయి కళ్ళతో, ముక్కోటి ఆశలతో ఎదురు చూస్తున్న సుముహూర్తం వచ్చేస్తోంది. అవును, ఎంతో కాలంగా ఊహగానాలకే పరిమితం అయిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ త్వరలోనే ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచే స్పష్టమైన సకేతాలు వచ్చేశాయి. పునర్‌ వ్యవస్థీకరణ విషయంలో ఇంతవరకు వాళ్ళూ వీళ్ళూ మాట్లాడడమే కానీ, ముఖ్యమంత్రి నోటి నుంఛి మాత్రం అలాంటి మాట ఎప్పుడూ రాలేదు. కానీ, ఈరోజు ( శుక్ర వారం) జరిగిన మంత్రి వర్గ సమావేశంలో, స్వయంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పునర్‌ వ్యవస్థీకరణపై మౌనం  వీడడమే కాదు, అందుకు సంబదించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులకోసం చాలా మంది పోటీలో ఉన్నారని చెప్పారు. మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన వారిని పక్కన పెట్టినట్లు కాదన్నారు. మళ్లీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరే అంటూ ముదస్తు బిస్కట్’ కూడా వేశారు. అంతే కాదు.. మంత్రివర్గంలో లేనివాళ్లు పార్టీ కోసం పనిచేయాలని చెప్పారు.అంటే ప్రస్తుత మంత్రుల్ల్లో కొదరు త్వరలో మాజీలు కాబోతున్నారని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఎంత మందికి ఉద్వాసన పలుకుతున్నారు, ఎవరెవరికి ఉద్వాసన పలుకుతున్నారు  అనేది మాత్రం స్పష్టం కాలేదు. గత కొంత కాలంగా త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్వరలో వైకాపా శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అదలా ఉంటే ,గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే తమ మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారానే ప్రచారం అటు పార్టీ వర్గాల్లో, ఇటు మీడియా వర్గాల్లో వినవస్తోంది.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే, ముఖ్యమంత్రి మంత్రివర్గ  పునర్వ్యవస్థీకరణ పై దృష్టి పెడతారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఊగాదికి కొత్త జిల్లాలతోపాటుగా, కొత్త మంత్రి వర్గం కొలువు తీరడం ఖాయమని,అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన వెంటనే, పాత ముఖాలను  పూర్తిగా పక్కన పెట్టి, కొత్తవారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు, అయితే, తొలి రెండున్నర సంవత్సరాలలో ఎక్కువ కాలం, ‘కొవిడ్’ మింగేయడంతో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణను మరో ఆరు నెలలు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ గడవు కూడా ముగియడంతో ముఖ్యమంత్రి ముహూర్తం ఖరారు చేశారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ముందు చెప్పినట్లుగా మంత్రివర్గాన్ని పూర్తిగా మార్చేసి ఆలోచన అయితే, ఇప్పుడు లేదని అంటున్నారు. ముందస్తు ఎన్నికల ఆలోచన కూడా ఉన్న నేపధ్యంలో మేకపాటి మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడంతో పాటుగా స్వల్పమార్పులు చేర్పులతో మంత్రివర్గ  పునర్వ్యవస్థీకరణ పూర్తిచేస్తారని అంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి ఇచ్చిన హింట్’ను బట్టి చూసినా, స్వల్పమార్పులతో సరిపెట్టే ఆలోచనలోనే ఆయన ఉన్నట్లు అర్థమవుతోంది.

అదలా ఉంటే, ఇప్పటికే నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఈసారి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లేజ్’ అంటూ ఆమె ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు అ అంతటా కనిపిస్తూనే ఉన్నాయి. సరే, రోజాకు మంత్రి పదవి వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఆదే స్థాయిలో మరో మహిళా ఎమ్మెల్యే,  చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ కూడా మంత్రి పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. 

By
en-us Political News

  
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.