ఏపీ బీజేపీకి గుండెదడ

Publish Date:Feb 11, 2015

Advertisement

 

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో కేంద్రంలో బీజేపీకే గుండెదడ మొదలైంది. ఆత్మ పరిశీలన ప్రారంభమైంది. మొన్నటి వరకూ మోడీ హవా అని అంటున్నవాళ్ళు ఇక ఆ మాట మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఢిల్లీలో ఓటమి నరేంద్రమోడీ పరిపాలనకు రెఫరెండం కాదు అని సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో ఓటమికి మోడీ కారణం కాదు.. నేనే కారణం అని కిరణ్ బేడీ ఒకటికి నాలుగుసార్లు నేరాన్ని తన నెత్తిమీద వేసుకోవాల్సి వచ్చింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు... కేంద్రంలోనే బీజేపీకి గుండెదడ మొదలైతే, రాష్ట్రాల్లో వున్న బీజేపీ నాయకత్వానికి గుండె దడ మొదలవకుండా వుంటుందా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వానికి ఆల్రెడీ గుండె దడ మొదలైపోయింది.

 

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలో భాగస్వామిగా వుంది. కొంతమంది ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి వున్నారు. అయితే ఇదంతా రాష్ట్రంలో బీజేపీకి ఉన్న బలానికి నిదర్శనమా అంటే... లేదనే సమాధానం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు ఎంత కారణమో, భారతీయ జనతా పార్టీ కూడా అంతే కారణం. అయితే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని ఎందుకు ఆదరించారంటే అది బీజేపీ గొప్పతనం కాదు... తెలుగుదేశం పార్టీతో స్నేహం చేయడం వల్ల అబ్బిన పరిమళం.

 

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీతో స్నేహం చేస్తూనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో బలపడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికారం కోసం తెలుగుదేశంతో పోటీ పడగలదన్న సంకేతాలు ఇచ్చింది. తెలుగుదేశం మినహా ఇతర పార్టీలకు చెందిన నాయకులను బీజేపీలోకి ముమ్మరంగా చేర్చుకుంది. అయితే బీజేపీ ఏపీలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోందే తప్ప రాష్ట్రానికి కేంద్రం నుంచి రావలసిన నిధుల విషయంలోగానీ, తెలంగాణతో వున్న వివాదాల విషయంలోగానీ, ప్రత్యేక హోదా విషయంలోగానీ సహకరించడం లేదన్న అభిప్రాయం ఏపీ ప్రజల్లో ఏర్పడింది. మొన్న కేంద్రం విదిల్చిన ప్యాకేజీ కూడా ఏపీ ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఫలితాలు వెలువడటం, ఆ ఫలితాలు బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా వుండటం బీజేపీ కేంద్ర నాయకత్వంతోపాటు రాష్ట్ర నాయకత్వానికి కూడా షాకిచ్చింది. అతి కొద్దికాలంలోనే బీజేపీ ఢిల్లీ ప్రజలకు ఎలా దూరమైపోయిందో, తమ వ్యవహార శైలిని ఇలాగే కొనసాగిస్తే ఏపీలో కూడా తమ పరిస్థితి ఢిల్లీ తరహాలోనే అయ్యే ప్రమాదం వుందన్న గుండెదడ బీజేపీ ఏపీ నాయకత్వంలో మొదలైంది. గతంలో మాదిరిగా అలసత్వం వహించకుండా ఏపీకి అందాల్సిన ప్రయోజనాల గురించి కాస్త సీరియస్‌గా ఆలోచించాలని కేంద్ర నాయకత్వాన్ని హెచ్చరించాన్న ఆలోచనలో ఏపీ బీజేపీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.