దొంగ, పోలీస్‌ ఆటాడించి అత్తను చంపిన కోడలు

Publish Date:Nov 9, 2025

Advertisement

 

అత్త కోడలు మధ్య విభేదాలు సహజంగా ఉంటాయి. కానీ ఆ కోడలు ప్రేమతో అత్తతో దాగుడుమూతలు ఆట ఆడింది. నిజంగా అన్యోన్య భావంతో కోడలు ఆటాడిందని పొరపాటు పడొచ్చు. ఆ ఆట వెనక ఓ హత్య ఉంటుందని అత్తకు తెలియ లేదు. ఓ నిండు ప్రాణం ఆ ఆటలో ఆగిపోయింది. విశాఖలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు  సంచలనంగా మారింది. 

ఆ దాగుడుమూతల ఆటలో ఏం జరిగింది

విశాఖ నగర శివారు సింహాచలం దగ్గర అప్పన్నపాలెం వద్ద వర్షిని అపార్ట్మెంట్లో జయంతి కనకమాలక్ష్మి అనే వృద్ధురాలు నివసిస్తున్నారు. ఆమె కుమారుడు పురోహితుడు. భార్య ఇద్దరు పిల్లలు 66 సంవత్సరాల ఆ  తల్లితోపాటు భార్య తల్లి కూడా ఆ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఈ దశలో ఈనెల 7వ తేదీన కోడలు లలిత అత్త కనక మహాలక్ష్మి తో దాగుడుమూతలు ఆట ఆడాలని చెప్పింది దీనికి పిల్లలను కూడా పిలిచి నాన్నమ్మకు కుర్చీలో కూర్చోబెట్టి చేతులు కాళ్లకు తాళ్లు కట్టి దాగుడుమూతల ఆట ఆడాలని చెప్పింది .

 దాంతో పిల్లలు ఆమె కలిసి అత్త కనక మహాలక్ష్మికి చేతులు కాళ్లు కుర్చీకి కట్టేశారు ఆటలో భాగంగా చిన్న పిల్లలు గదుల్లో దాక్కున్నారు. ఆ తర్వాత కొంత సేపటికి మంటలతో అత్త కనకమహాలక్ష్మి కేకలు వేస్తూ మంటల్లో తాళ్లు తెగిపోవడంతో హాల్ నుంచి దేవుడు గదిలోకి పరుగులు తీసింది ఆ కేకలు విని గదిలో ఉన్న మనవరాలు కూడా రావడంతో ఆమె కూడా మంటలకు గాయపడింది కొద్దిసేపటికి కోడలు లలిత తల్లి కూడా బయటకు వచ్చి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు కానీ అప్పటికే తీవ్రమైన మంటల గాయాలతో కనక మహాలక్ష్మి కుప్పకూలి చనిపోయారు..
..
అతను అంతం చేసేందుకు కోడలు ట్రిక్..
..
ఒక ఇంట్లో అత్తా కోడలు నివాసం ఉండడంతో మనస్పర్ధలు ఇటీవల ఏర్పడ్డాయి తరచూ తనపై భర్తకు అత్త విషయాలు చెప్పడంతో ఆయన తనను నిందిస్తున్నారని కోడలు లలిత కోపం పెట్టుకుంది. అత్తను చంపేస్తే మంచిదని నిర్ణయించింది దీనికోసం హౌ టు కిల్ అనే యూట్యూబ్ వీడియోలను పరిశీలించింది అందులో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియో ఆమెను ఆకట్టుకుంది. 

ఆ ప్రకారం అతను దాగుడుమూతలు ఆట ఆడుదామని చెప్పి లలిత పద్ధతి ప్రకారం చంపేసింది. ముందుగా పిల్లలతో కలిసి కుర్చీలో అత్తకు కాళ్ళు చేతులు కాళ్లతో కట్టి కట్టి వాళ్లు గదుల్లో దాక్కునగా ముందు రోజు తీసుకు వచ్చిన పెట్రోల్ అత్తపై పోసి కోడలు లలిత నిప్పు అంటించింది. మంటల్లో కాలి చనిపోతుందని ఆమె లలిత భావించింది. ఆ క్రమంలోనే అతను హత్య చేసింది.
..
నిందితురాల్ని పట్టించిన రెండు కారణాలు 
..
సాంప్రదాయ రీతిన జీవనం సాగించే ఇంటిలో జరిగిన ఈ ఘటన పై ఎవరికి అనుమానం రాలేదు. అత్త దాగుడుమూతలు ఆట ఆడుతుండగా టీవీ వైర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి కాలిపోయారని కోడలు లలిత ముందుగా పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులు కూడా అనుమానించలేదు. అయితే ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడగా అత్త దేవుడికి దీపం పెడుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందని చెప్పారు 

పరస్పర విరుద్ధమైన ఈ రెండు కారణాలు ఆ కోడలు ఎందుకు చెప్పారని పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఉదయం 8 గంటలకు ఈ ఘటన చోటు చేసుకోగా పోలీసుల విచారణలో రాత్రి 11:30 గంటలకు నిజం బయటికి వచ్చింది. తానే హత్య చేసినట్టు కోడలు లలిత అంగీకరించింది.. హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియో ను ఆధారంగా ఈ కోడలు అత్తను అమానుషంగా చంపేసింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

By
en-us Political News

  
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.