పాకిస్థాన్‌లో పురాతన గురుద్వారా ధ్వంసం.. ఇండియా సీరియస్!

Publish Date:Jul 2, 2026

Advertisement

పాకిస్థాన్‌లో మైనారిటీలకు రక్షణ,  మతపరమైన కట్టడాలకు భద్రత కరవైంది.  పాకిస్థాన్ లో  హిందువులు, సిక్కుల ప్రార్థనా స్థలాలపై తరచూ జరుగుతున్న దాడులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.  తాజాగా పాకిస్థాన్ లో నూట పాతిక సంవత్సరాల నాటి పురాతన గురుద్వారాను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.  పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో శతాబ్ద కాలానికి పైగా ఎంతో పవిత్రంగా, చారిత్రక వారసత్వంగా విరాజిల్లుతున్న గురుద్వారాను కొందరు దుండగులు పాక్షికంగా కూల్చివేసి ధ్వంసం చేయడంపై  సిక్కు సమాజమే  కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇండియా కూడా తీవ్రంగా స్పందించి  పాకిస్థాన్ తీరును గర్హించింది. 

పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌ పరిధిలోని ఫరూఖాబాద్ ప్రాంతంలో చారిత్రక ప్రాధాన్యం కలిగిన  గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ సాహిబ్  125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పురాతన కట్టడం. ఈ కట్టడం   సిక్కుల సంస్కృతికి, వారి అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. అయితే, గత నెల 24న   గుర్తుతెలియని   దుండగులు ఈ  గురుద్వారాపై దాడి చేసి..   ప్రధాన గుమ్మటంతో పాటు, కట్టడంలోని కొన్ని ముఖ్యమైన భాగాలను  కూల్చివేశారు. ఈ విధ్వంసం జరుగుతున్నప్పుడు స్థానిక అధికారులు, రక్షక భట నిలయ సిబ్బంది కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. 

ఈ చారిత్రక కట్టడంపై జరిగిన దాడిని నివారించడంలోనూ, మైనారిటీల ఆస్తులను కాపాడటంలోను స్థానిక పాకిస్థాన్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని అక్కడి సిక్కు సంఘాలుఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  ఈ  ఘటనపై  అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.  ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ  సహా   దేశంలోని పలు ప్రతిష్టాత్మక సిక్కు   సంస్థలు ఈ దారుణాన్ని ముక్తకంఠంతో ఖండించాయి. పాకిస్థాన్ భూభాగంలో నివసిస్తున్న మైనారిటీల ప్రాణాలకు, వారి పవిత్ర ప్రార్థనా స్థలాలకు ఏమాత్రం రక్షణ కల్పించలేకపోతున్నారని, అక్కడి ప్రభుత్వం తక్షణమే మేల్కొని తగిన రక్షణ చర్యలు చేపట్టాలని భారతీయ సిక్కు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.

గురుద్వారా ధ్వంసం ఘటనను  భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది.   ఈ అనాగరిక ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం తక్షణమే అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని, ఈ ఘోరానికి ఒడిగట్టిన దోషులను గుర్తించి వారిని శిక్షించాలనీ డిమాండ్ చేసింది.  పాకిస్థాన్‌లో మైనారిటీలు, వారి ప్రార్థనా స్థలాలు లక్ష్యంగా నిరంతరం సాగుతున్న దాడులను అరికట్టడంలో పాక్ విఫలమవుతోందని, ఇటువంటి దుశ్చర్యలకు ఇకనైనా స్వస్తి పలకాలని హెచ్చరించింది.  

By
en-us Political News

  
గల్ఫ్ దేశంలో ఉద్యోగాల కోసం 20 మంది మహిళలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న వీరు విమానం ఎక్కబోతుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని నిలిపివేసి అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌తో పాటు మొత్తం 20 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఎలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా అధికారులు అత్యంత గోప్యంగా ఈ సోదాలు చేపట్టాయి.
మణిపూర్‌లోని కమ్‌జాంగ్ జిల్లా సరిహద్దు గ్రామాలు బుధవారం (జులై1) హింసాత్మక ఘర్షణలు, పరస్పర దాడులలతో దద్దరిల్లిపోయాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
జడ శ్రవణ్ కుమార్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నాలుక కోసి దానిని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పార్సిల్ పంపిస్తానంటూ అభ్యంతరకరమైన,అనుచితమైన వ్యాఖ్యలు చేశారు.
అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారీ స్కోరు సాధించినప్పటికీ, వరుణుడు విరుచుకుపడటంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
చాలా కాలంగా ఇరు దేశాల మధ్య నిలిచిపోయిన అధికారిక, అనధికారిక దౌత్య మార్గాలను మళ్లీ తెరిచి, అన్ని సమస్యలపై ప్రత్యక్ష సంప్రదింపులకు తక్షణమే శ్రీకారం చుట్టాలని ఈ ప్రముఖులు ఆ లేఖలో ఇరు దేశాల ప్రముఖులకు విజ్ణప్తి చేశారు.
అమెరికా అండతో రెచ్చిపోతున్న ఇజ్రాయెల్‌ను అదుపులో ఉంచాలనీ, లేకుండా తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. అమెరికా గనుక ఇజ్రాయెల్ దేశాన్ని నియంత్రించడంలో విఫలమైతే.. తామ స్పందన తీవ్రాతి తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారం, వ్యక్తిగత దూషణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన పరిచయం ప్రేమగా మారింది.
స్టీల్ ప్లాంట్ సందర్శనకు వైసీపీకి అనుమతి నిరాకరణ..
ఇరాన్ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కన్నుమూయడంతో ఆ దేశంలో ఒక చారిత్రాత్మక అధ్యాయం ముగిసింది
ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదమే తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.