Publish Date:Apr 15, 2024
ఏ నోట విన్నా ఒకటే మాట.. ఏ సర్వే చూసినా ఒకటే ఫలితం. ఏపీలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. తాజాగా మరో జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే కూడా అదే ఫలితాన్ని వెలువరించింది. ఏపీలో తెలుగుదేశం కూటమి విజయం ఖాయమని పేర్కొంది. వైసీపీ భారీగా నష్టపోతున్నదని తేల్చేసింది. రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నాయని కుండబద్దలు కొట్టింది.అదే విధంగా తెలుగుదేశం కూటమి 18 స్థానాలలో విజయకేతనం ఎగురవేయనున్నట్లు స్పష్టం చేసింది.
రాష్ట్రంలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. ఏపీలో ఈ సారి జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా న్యూస్ ఎక్స్ నిర్వహించిన సర్వే ఫలితం కూడా రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది తెలుగుదేశం కూటమేనని నిర్ద్వంద్వంగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందని వెల్లడించింది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 18 లోక్ సభ స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేసింది.
రాష్ట్రంలో మొత్తం పాతిక లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం పార్టీ 17 స్థానాలలో పోటీ చేస్తున్నది. కూటమిభాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీ వరుసగా రెండు, ఆరు స్థానాలలో పోటీ చేయనున్నాయి. ఇక న్యూస్ ఎక్స్ సర్వే ఫలితం మేరకు తెలుగుదేశం పోటీ చేస్తున్న 17 లోక్ సభ స్థానాలలో 14 స్థానాలలో విజయం సాధిస్తుంది. బీజేపీ పోటీ చేస్తున్న 6 స్థానాలలో రెండింటిలో విజయకేతనం ఎగుర వేస్తుంది. ఇక జనసేన అయితే పోటీ చేస్తున్న రెండు స్థానాలలోనూ గెలపు తథ్యం. అంటే తెలుగుదేశం కూటమి 18 స్థానాలలో విజయం సాధిస్తుంది. అధికార వైసీపీ కేవలం ఏడు స్థానాలలో మాత్రమే గెలుపొందే అవకాశాలున్నాయి.
దాదాపుగా ఇవే ఫలితాలు అసెంబ్లీ నియోజకవర్గాలలోనే ప్రతిఫలించనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి 126 స్థానాలలో విజయం సాధిస్తుంది. అధికార వైసీపీ 49 స్థానాలతో సరిపెట్టుకుంటుంది. అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, చంద్రబాబు సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టడం ఖాయమని సర్వే తేల్చింది.
తెలుగుదేశం 144 అసెంబ్లీ నియోజకవర్గాలలో, జనసేన 21, బీజేపీ పది స్థానాలలో అభ్యర్థులను నిలుపుతోంది. లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలను బట్టి చూస్తే తెలుగుదేశం కనీసం 98 స్థానాలలో విజయం సాధిస్తుంది. అయితే పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ మరింతగా పడిపోయే అవకాశాలున్నాయనీ, ఎన్నికల సమయానికి తెలుగుదేశం కూటమి సాధించే స్థానాల సంఖ్య పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్రంలో పుంజుకోవడం వైసీపీకి భారీ నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంటే ఆ మేరకు వైసీపీ మరింతగా నష్టపోవడం ఖాయమని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anathor-survey-confirms-tdp-alliance-win-39-173904.html
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.