తెరాసకు మరో ఉద్యమ నేత గుడ్‌బై !

Publish Date:Jul 30, 2022

Advertisement

ఉద్యమ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట సమితి (తెరాస)లో ఉద్యమ నాయకులకు, విలువ లేదు. ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో స్థానం లేదు. గౌరవం అసలే లేదు. ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు కనీసపాటి గుర్తింపు లేదు. ఉద్యమ కాలంలోనే ఆలే నరేంద్ర మొదలు ఎందరో ఉద్యమ నేతలను సాగనంపారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసేఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఉద్యమ వాసనలున్న ఏ ఒక్కరినీ వదలకుండా ఉద్వాసన పలికారనే ఆరోపణలున్నాయి. ఉద్యమం చివరి దశకు చేరుకున్న సమయంలో కేసీఆర్కు కుడి భుజంగా ఉన్న జేఏసీ చైర్మన్ కోదండరామ్ మొదలు పార్టీ నిర్మాణంలో, ఉద్యమంలో, ప్రభుత్వంలో కీలక భూమికను పోషించిన ఈటల రాజేందర్ వరకు ఎంతో మంది ఉద్యమ నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు పంపించారనే ఆరోపణలున్నాయి. అదే సమయంలో ఉద్యమ ద్రోహులుగా ముద్ర వేసుకున్న తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకర రావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి వంటి వారికి  మంత్రి వర్గంలో స్థానం కలిపించారనే విమర్శలు ఉన్నాయి. నిజానికి కేసీఆర్, 2014లోనే ఇక తెరాస ఉద్యమ పార్టీ కాదని ప్రకటించారు. ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ అని స్పష్టం చేశారు. 

అయినా, తెరాసలో ఒకరో ఇద్దరో ఉద్యమ నాయకులు మిగిలున్నారు. అలాంటి వారిలో, . తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటి ఉన్న సీనియర్ నేత, కన్నెబోయిన రాజయ్య యాదవ్ ఒకరు. ఇప్పుడు ఆయన కూడా గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు  రాజయ్య యాదవ్ ప్రకటించారు. తెరాసతో 22 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు తెలిపారు. నిజానికి, రాజయ్య యాదవ్ తెరాసలో ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియనే తెలియదు. పార్టీ నాయకత్వం ఆయన్ని మరిచే పోయింది. కానీ, ఉద్యమం చివరి అంకంలో కేసీఆర్ తో కలి నిరాహార దీక్ష చేసిన ఆరుగురు నేతల్లో ఆయన ఒకరు. ముఖ్యమంతి కేసీఆర్, చావునోట్లో తలపెట్టిన సమయంలో కన్నెబోయిన యాదవ్ ఆయన వెంటే  ఉన్నారు. 
అయితే ఇప్పడు ఆయన తాను మోస పోయానని, కేసేఆర్ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తపరిచారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఇలా ఎన్నో ఆశలు కల్పించి చివరకు, మొండి చేయి చూపించారని అన్నారు. పదవులు ఇవ్వకపోతే ఇవ్వక పోయారు, పార్టీలో పలకరించే వారే కరువయ్యారని అవేదన వ్యక్త పరిచారు. పార్టీలో ఆత్మగౌరవం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు రాజయ్య.

 తెరాస ఆవిర్భావ క్షణం నుంచి ఒక కార్యకర్తగా సుదీర్ఘ కాలం పనిచేశాను. కానీ పార్టీలో ఆత్మగౌరవం లేదు. ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోంది. మెదక్ ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి..మాట తప్పారు. రాజ్యసభకు పంపుతామన్నారు,  మళ్ళీ  మాట  తప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. దానికీ పంపించలేదు. ఏ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అక్కడ ఆత్మ గౌరవం లేదు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు తెరాసలో చోటు లేకుండాపోయింది. టీఆర్ఎస్‌లో ఉన్న ఉద్యమకారులకు బాధ తప్ప.. భవిష్యత్ లేదు. తలెత్తుకోవాలని బతకాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తున్నా. నా బాటలోనే మరికొందరు నేతలు కూడా టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారు  అని కన్నబోయిన రాజయ్య యాదవ్ పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ ఉద్యమ తొలినాళ్ల నుంచి కేసీఆర్‌తో కలిసి పనిచేసిన నాయకుడిగా రాజయ్య యాదవ్‌కు మంచి గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆరుగురు సీనియర్ నేతలతో కలిసి దీక్ష చేసిన నాయకుల్లో రాజయ్య కూడా ఉన్నారు. కరీంనగర్ అలుగునూర్ వద్ద అరెస్టయ్యారు.  ఖమ్మం జైలులో కేసీఆర్‌తో పాటు ఉన్నారు. అలాంటి సీనియర్ నేత పార్టీ వదిలి పోవడం, అంటే, ఉద్యమానికి, తెరాసకు ఉన్న బంధం పూర్తిగా తెగిపోవడమే అంటున్నారు. ఆయన పార్టీని వదిలి పోవడం ఒకెత్తు అయితే  టీఆర్ఎస్‌లో ఉన్న ఉద్యమకారులకు బాధ తప్ప.. భవిష్యత్ లేదు, అంటూ చేసిన వ్యాఖ్య పార్టీలో కలకలం సృష్టిస్తోంది.ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించలేదు కానీ, బీజేపీలోకి వెళ్లే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఆయన ఏ పార్టీలోకి వెళతారు అనేది ఎలా ఉన్నా, రాజయ్య యాదవ్ పార్టీకి గుడ్‌బై చెప్పడం సంక్షోభంలో చిక్కుకున్న తెరాసకు గట్టి ఎదురు దెబ్బని పార్టీ నేతలు అంటున్నారు

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.