ఏపీలో రాజ్యమేలుతున్న అరాచకత్వం!

Publish Date:Sep 11, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ తీరు సర్వ వ్యవస్థలనూ నిర్వీర్యం చేసేస్తోంది. అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులోత్తడంలో పోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ తరించిపోతున్నాయి. సర్వ విలువలకూ తిలోదకాలిస్తూ ఏలిన వారి ప్రాపకం పొందడమే పరమావధిగా ఏపీ సీఐడీ తీరు ఉందన్న విమర్శలు గతంలోనే వెల్లువెత్తాయి. ఇప్పడు చంద్రబాబు అరెస్టు, లోకేష్ ను కూడా అరెస్టు చేస్తాం అంటూ మీడియా ఎదుటకు వచ్చి సీఐడీ చీఫ్ చెప్పిన మాటలతో ఆయన సీఐడీ అధికారా, వైసీపీ క్రియాశీల కార్యకర్తా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

సామాజిక మాధ్యమంలో ఏపీ పోలీసు వ్యవస్థ మొత్తం వైసీపీ కండువా వేసుకుని పని చేస్తున్నదంటూ నెటిజన్లు తెగ ఏకి పారేస్తున్నారు. ఏపీలో రాజకీయాలు జగన్ కు ముందు జగన్ తరువాత అన్నట్లుగా తయారయ్యాయి. అధికారంలో ఉంటే మేం చెప్పిందే వేదం.. మా మాటే శాసనం అని జనగ్ ప్రభుత్వ పాలనకు కొత్త అర్ధం చెబుతున్నారు. అధికార దండం ఉంది కనుక నాకు నచ్చని వారిని, నన్ను మెచ్చని వారినీ బయట తిరగనీయం అన్నట్లుగా ఆయన తీరు ఉంది. సాధారణంగా పాలన అంటే ప్రగతి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన,  ఉపాధి, ఉద్యోగ అవకాశాల మెరుగుదల అని ఎవరైనా భావిస్తారు. కానీ ఏపీలో మాత్రం జగన్ జమానాలో అవన్నీ జనం ఎప్పుడో మరిచిపోయారు. వాటి గురించి మాట్లాడితే పోలీసులు అర్ధరాత్రి గోడలు దూకి, తలుపులు పగులగొట్టుకుని ఇళ్లల్లోకి జొరబడి మరీ అరెస్టు చేస్తారన్న భయం ఇప్పుడు ఏపీలో సర్వత్రా నెలకొని ఉంది. ప్రభుత్వ విధానాలలోని లోపాలు ఎత్తి చూపిన ప్రతి వారికీ ఇటువంటి మర్యాదే జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే..అధికారం రూపంలో అరాచకత్వం రాజ్యమేలుతోంది. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు.. ఏపీలో ఇప్పుడు
రెండు రెళ్ళు నాలుగన్నందుకు
గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమగా మారిపోయింది.  క్షేమం అవిభాజ్యం అంటే
జైళ్ళు నోళ్ళు తెరుస్తున్నాయి.   అవినీతి భారీ పరిశ్రమలో అన్యాయాల ధరలు పెంచేసి
సాతంత్యాన్ని బ్యాంకుల్లో వేసుకుని చక్రవడ్డీ తిప్పే కామందుల రాజ్యం సాగుతోంది. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా రాజకీయాలు చేసే వారు పేదల, ప్రజల పక్షం వహించడమే పెద్ద అపరాధమైపోయింది.  అధికారం   చేతుల్లో ఉంది కనుక మేం చెప్పేదే వేదం, మేం చేసేదే న్యాయం వ్యవస్థలదేముంది.. మా చెప్పు చేతల్లోనే ఉంటాయి అన్న అహంభావం అధికారం ఏలుతోంది.  అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి గురించి, పరిశ్రమల గురించి,  ఆరోగ్యం గురించి, ఉపాధి, ఉద్యోగాల గురించి ఎవరూ మాట్లాడే ధైర్యం చేయడం లేదు.  

నియంతలు ఎవరైనా అధికారం తమ చేతల్లో చేతుల్లో శాశ్వతంగా ఇమిడిపోతుందని భావిస్తారు. అయితే అది శాశ్వతం కాదని చరిత్ర పలు మార్లు రుజువు చేసింది. హిట్లర్ నుంచి  ఇష్టారాజ్యంగా  వ్యవహరించిన నియంతలంతా మట్టిగరిచారు. అయితే ఎవరికైనా తనదాకా వస్తే కాని తత్వం బోధపడదు. ఇప్పుడు ఏపీలో అరాచకపాలన సాగిస్తున్న వారికి కూడా త్వరలోనే తత్వం బోధపడుతుంది. వెయిట్ చేయాలంతే. 

By
en-us Political News

  
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.