వైసీపీ నేత నేత బోరుగడ్డ అనిల్ కుమార్ కు అనంతపురం జిల్లా కోర్టు శనివారం ( మే3) బెయలు మంజూరు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బోరుగడ్డ అనిల్ కుమార్ పై అనంతపురంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు శనివారం బెయిలు మంజూరైంది. 90 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ పై ఇంత వరకూ చార్జిషీట్ దాఖలు చేయకుండా అనంతపురం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే బెయిలు మంజూరు కావడానికి కారణం. ఈ విషయాన్ని కోర్టు తన తీర్పు లో స్పష్టంగా పేర్కొంది.
వైసీపీ హయాంలో బోరుగడ్డ అనిల్ తెలుగుదేశం, జనసేన నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లను అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు బోరుగడ్డ అనిల్ ను అరెస్టు చేశారు.
కాగా గతంలో కూడా ఓ సారి హైకోర్టు బోరుగడ్డ అనిల్ కు బెయిలు మంజూరు చేసింది. అప్పట్లో బెయిలుపై విడుదలైన ఆయన ఆ తరువాత అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఆ తరువాత తల్లికి అనారోగ్యం అంటూ నకిలీ సర్టిఫికెట్ సమర్పించి బోరుగడ్డ అనిల్ బెయిలు పొందినట్లు తేలడంతో హైకోర్టు ఆయన ను తక్షణమే లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో బోరుగడ్డ అనిల్ అప్పట్లో బోరుగడ్డ అనిల్ కోర్టు విధించిన గడువులోగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో లొంగిపోయారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు బెయిలు మంజూరైంది. అయితే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే అయినకు బెయిలు మంజూరైంది. దీనిపై తెలుగుదేశం శ్రేణులు అనంతపురం పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ananthapuram-court-grant-bail-to-borugadda-anil-kumar-39-197410.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.