ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన వివాహిత.. ఎందుకంటే..!

Publish Date:Aug 2, 2026

Advertisement

 

ఓ వైపు వివాహేతర సంబంధం.. మరోవైపు కుమార్తె విషయంలో రగిలిన తల్లి ఆగ్రహం.. చివరకు ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. అనంతపురం నగరంలోని డ్రైవర్స్ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న సునీతకు సురేష్ అనే యువకుడితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఒకవైపు తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే మరోవైపు సునీత కూతురుతో అసభ్యంగా ప్రవర్తించ సాగాడు. అయితే సురేష్ తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సునీతకు తెలియడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కూతురి విషయంలో సురేష్ తీరుపై తీవ్ర ఆగ్రహానికి గురైన సునీత... పథకం ప్రకారం తన ప్రేమతో అతన్ని కౌగిల్లో బంధించి కాళ్లు, చేతులు కట్టేసి పదునైన ఆయుధంతో దాడి చేసి మర్మాంగాన్ని కోసి వేసింది. 

ఈ దాడిలో సురేష్ తీవ్రంగా గాయపడ్డా డు.ఘటన విషయం బయటకు రావడంతో డ్రైవర్స్ కాలనీలో ఒక్కసారిగా కలకలం రేగింది. తీవ్ర గాయాలతో ఉన్న సురేష్‌ను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటి? సురేష్ సునీత కుమార్తెతో ఎలా ప్రవర్తించాడు? దాడి ఏ పరిస్థితుల్లో జరిగింది? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సునీత, సురేష్ మధ్య ఉన్న సంబంధం, ఘటనకు ముందు జరిగిన పరిణా మాలపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది. కేసు నమోదు, నిందితురాలిపై తీసుకునే చర్యలు తదితర అంశాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Anantapur dist, Drivers Colony, Suresh, Sunita, AP Police, Crime news

By
en-us Political News

  
మామతో బైక్‌పై వెళ్లి లారీ కిందపడిన చిన్నారి..
విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన రౌడీషీటర్ సాయికృష్ణ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది.
కర్ణాటక వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి.
యూసఫ్ గూడలో కారు బీభత్సం..ఇద్దరికి తీవ్ర గాయాలు..!
తెలుగు రాష్ట్రాల్లో అనధికారిక చిట్టీల పేరుతో మోసాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.
స్నేహబంధానికి ప్రతీకగా నిలిచే ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు ఒకే కుటుంబంలో ఆరని శోకాన్ని మిగిల్చాయి.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్..!
ఆంధ్రప్రదేశ్- ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
దక్షిణ అమెరికా దేశమైన పెరూలో ఆదివారం ఉదయం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనార్..
వైసీపీ నాయకుల వైఖరి, గత ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఉత్తరాంధ్ర ప్రజల కలల ప్రాజెక్ట్ అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం తీవ్రంగా ఆలస్యమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.