ఉక్రెయిన్ యుద్ధం.. ఆనంద్ మహేంద్ర సంచలన నిర్ణయం..
Publish Date:Mar 3, 2022
Advertisement
ఈ యుద్దంతో ఉక్రెయిన్’ ఏమి నేర్చుకుందో ఏమో కానీ, ప్రపంచానానికి మాత్రం చాలా పాఠాలు చెప్పింది. శతృ దేశమే కాదు, మిత్ర దేశమే అయినా ఏ దేశాన్ని గుడ్డిగా నమ్మరాదు. ఇది, ఉక్రెయిన్ చెపుతున్న మొదటి పథం పాఠం. రష్యాను నమ్మి, ఉక్రెయిన్’ అణ్వాయుధాలను వదులు కుంది అందుకు ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది.అలాగే, అమెరికా కానీ, మరో దేశం కానీ మనకు అండగా ఉందని, ఉంటుందని అనుకోవడం, ఏ దేశానికి మంచిది కాదు. ఇది ఉక్రెయిన్ చెపుతున్న మరో పాఠం. ఇలా ఉక్రెయిన్’ చెప్పిన పాఠాలు ఇంకా ఉన్నాయి, అయితే, ఇది పాఠం అనొచ్చో అనకూడదో గానీ, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర, యుద్ధం సృష్టుంచిన భీకర ప్రళయం నేపధ్యంగా సంచలన నిర్ణయం తీసుకునంరు. ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన ఎత్తును, ఔనత్యాన్ని మరింగా పెంచింది. మనకు తెలుసు మన భారతీయులు ఎక్కువగా మెడిసన్ కోసం ఉక్రెయిన్’కు వెళ్తుంటారు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ సుమారు 20 వేలమంది భారతీయ విద్యార్ధులు ఆ దేశంలో చిక్కుకు పోయారు. అక్కడ చిక్కుకున్న మన దేశ విద్యార్థులను స్వదేశానికి తరలిస్తున్నారు. విద్యార్థులను తరలించేందుకు ఆపరేషన్ గంగన్ ను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే చాల వరకు విద్యార్ధులు సురక్షితంగా స్వదేశం చేరుకున్నారు. అయినా, యుద్ధం మొదలైంది మొదలు, అక్కడ చిక్కుకుపోయిన పిల్లలు, ఇక్కడ పిల్లల తల్లితండ్రులు అనుభవిస్తున్న వేదన అంతా ఇంత కాదు. ఈ వేదనకు పరిష్కారంగా, మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ నిర్మించాలని ఆనంద మహేంద్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలంటూ మహీంద్రా యూనివర్సిటీ బాధ్యులకు సూచనలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు ఆనంద్ మహీంద్రా. మన దేశంలో మెడికల్ కాలేజీలు లేవా.. ? ఎందుకు ఇంత మంది మెడిసన్ చదివేందకు వేరే దేశాలకు వెళ్తున్నారు.? ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు పెట్టేందుకు అవకాశం ఉందా? అంటూ టెక్ మహీంద్రా చీఫ్ సీపీ గుర్నానిని ఆదేశించారు.ఇప్పుడు ఆనంద్ మహేంద్ర ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అదలా ఉంటే మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్‌లోనే ఉంది. దాంతో మెడికల్ కాలేజ్ కూడా హైదరాబాద్ లోనే ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే, ఎక్కడ ఏర్పాటు చేస్తారు, అనేది పక్కన పెడితే, ఓ మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టిన ఆనంద్ మహేంద్ర నిజంగా అభినందనీయుడు... అంటున్నారు.
http://www.teluguone.com/news/content/anand-mahindra-going-to-start-medical-university-39-132541.html





