బీజేపీకి కొత్త అధ‌్యక్షుడు వస్తాడా? అమిత్‌షాపై ఎందుకీ ప్రచారం?
Publish Date:Aug 1, 2017
Advertisement
దేశమంతా కమలం విస్తరించడానికి నూటికి నూరుపాళ్ల కృషి చేసింది అమిత్‌షా. మనోడు కాన్‌స్ట్రేషన్ చేశాడంటే... హండ్రెడ్ పర్సెంట్ వర్కవుట్ అవ్వాల్సిందే. అలా ఉంటుంది ప్లాన్. అంతేకాదు బాస్ ఆదేశిస్తే... తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. ప్రధాని మోడీకి నమ్మినబంటు. ఎందుకంటే మోడీ ప్లాన్ వేస్తాడు... షా పాటిస్తాడు. పక్కాగా స్కెచ్ వేస్తాడు. అంతా ఎక్కడికక్కడ సెట్ చేస్తాడు షా. ప్రత్యర్థుల నోట మాట రాకుండా చేయడంలో దిట్ట. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో విపక్షాల వెన్ను విరుస్తాడు. షా సెట్ చేశాడంటే... ఎలాంటి పరిస్థితులైనా దారికి రావాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే అమిత్‌షా... ఒక రాజకీయ వ్యూహకర్త. హిందూత్వాన్ని, కశ్మీర్ వంటి సున్నితమైన సమస్యను, అయోధ్య వంటి అతి సున్నితమైన ఇష్యూను టేకాఫ్ చేసి స్వయంగా మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం అమిత్‌షా వ్యూహానికి ఒక ఉదాహరణ. తెర వెనుక ఉంటూ రాజకీయ తెరపై బొమ్మను ఎలా ఆడించాలో... అలా ఆడించగల సత్తా ఉన్న నాయకుడు అమిత్‌షా. ఇక ఇప్పటివరకూ పార్టీలో చక్రం తిప్పిన షా... ప్రభుత్వంలోనూ తన మార్కు చూపించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తోన్న అమిత్‌షా... త్వరలో జరగనున్న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో... మోడీ కేబినెట్‌లో చేరతారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు హోం, రక్షణశాఖల్లో ఏదో ఒకటి అమిత్‌షాకు అప్పగిస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటుకున్న అమిత్‌షా... ఇక ప్రభుత్వ విధానాల్లో ప్రత్యక్షంగా తనదైన ముద్ర వేసేందుకు మంత్రి పదవిని చేపట్టాలనుకుంటున్నారని బీజేపీలోని ఓ వర్గం చెబుతోంది. అయితే అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉండదని, ఒకవేళ అమిత్‌షా మంత్రి పదవి చేపడితే పార్టీ అధ్యక్ష పదవిని వదులుకోవాల్సి ఉంటుందని మరో వర్గం చెబుతోంది. అయితే ఈ ప్రచారాన్ని అమిత్‌షా ఖండించారు. తాను అధ్యక్ష పదవిలో సంతృప్తిగా ఉన్నానంటూ వదంతులకు తెరదించారు. అయినా ప్రచారం మాత్రం ఆగడం లేదు. మరి అమిత్‌షా... మోడీ కేబినెట్‌లో చేరతారో లేదో... తెలియాలంటే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగే వరకూ ఆగాల్సిందే.
http://www.teluguone.com/news/content/amith-shah-45-76728.html





