ఏపీ పై షా నజర్ అందుకేనా.. జగన్ రెడ్డికి  మూడినట్లేనా? 

Publish Date:Nov 16, 2021

Advertisement

కేంద్ర హోమ్ మంత్రి హోదాలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు  తిరుపతి వచ్చిన బీజేపీ కీలక నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు,అమిత్ షా స్వామి కార్యంతో పాటుగా స్వకార్యాన్ని చక్కపెట్టుకుని వెళ్ళారు. రాష్ట్రంలో మూడు రోజులున్న అమిత్ షా, చివరి రోజు సోమవారం (నవంబర్ 15) పూర్తిగా రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టిని కేంద్రీకరించారు.

రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇంచార్జ్ సంతోష్ జీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు సుజన చౌదరి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహ రావు, పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహా ఇంచార్జ్ సునీల్ ధియోధర్ ఇతర ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం చర్చలు ఎదో వచ్చాం కాబట్టి, నాలుగు మాటలు  మాట్లాడి  పోదాం అన్న విధంగా కాకుండా, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో పక్కా ప్రణాలిక, అజెండాతో నిర్వహించి నట్లే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం అయ్యేపనేనా, అది సాధ్యమా అనే విషయాన్ని పక్కన పెడితే, షా చూపు ఏపీ మీద పడింది అనేది మాత్రం నిజమని అంటున్నారు.  

ఈ సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశాయని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రదానంగా అమిత్ షా మూడు విషయాలపై పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అందులో  మొదటిది, ఒక రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలని కోరుతూ అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళన, పాద యాత్రకు బీజేపీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో మరో అభిప్రాయం, ఆలోచనకు తావు లేదని తేల్చి చెప్పారు. అమరావతి రైతుల ఆందోళనకు మద్దతు తెలియచేస్తూ పార్టీ తీర్మానం చేసిన తర్వాత, ఇక ఆ విషయంలో చర్చ ఎందుకని, రైతుల ఆందోళనకు రాజకీయ రంగులు అద్దుతున్న నాయకులకు గట్టిగా చురకలు అంటించారు. రాజదాని ఆందోళనను, రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా భూములు ఇచ్చిన రైతుల ఆందోళనగానే చూడాలని స్పష్టం చేశారు. అంటే, జగన్ రెడ్డి మూడు రాజధానుల గోల్ మాల్ వ్యవహారాన్ని, కేంద్ర ప్రభుత్వం సాగానీయదని చెప్పకనే చెప్పారు. 

రాష్ట్రంలో అధికార వైసీపీతో అంటకాగుతున్న నాయకులకు అమిత్ షా  చురకలు కాదు ఏకంగా వాతలే పెట్టారని సమాచారం. వైసీపీతో ఎలాంటి బంధం అనుబంధం లేదని, జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై ప్రజాఉద్యమాలను నిర్మించి, పార్టీ ఒంటరిగా ఎదిగేదుకు కృషి చేయాలని, నాయకులకు అమిత్ షా దిశా నిర్దేశం చేశారని పార్టీ నాయకుల సమాచారం. ఒక విధంగా చూస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం పై షా ..యుద్ధాన్ని ప్రకటించారని అనుకోవచ్చని పరిశీలకులు పేర్కొంటున్నారు. 

అదే సమయంలో ఎన్నికల పొత్తుల గురించి ఎవరూ మాట్లాడవద్దని, సరైన సమయంలో కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకు ఎవరూ పొత్తుల ప్రస్తావన చేయవద్దని స్పష్టంచేశారు. అలాగే, రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవ్వాలంటే, ఇతర పార్టీలలోని సీనియర్ నాయకులను పార్టీలోకి ఆహ్వానించి సముచిత స్థానం కలిపించాలని అన్నట్లు పార్టీ నాయకులఈ  సందర్భంగా ఆయన, అస్సాంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన హేమంత్ బిస్వా శర్మను ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని గుర్తు చేశారని  సమావేశంలో పాల్గొన్న ఒక ముఖ్యనేత తెలిపారు. 

అదలా ఉంటే అమిత్ షా ఒక్క సారిగా ఎపీపి ఇంతలా దృష్టిని కేంద్రీక రించడం ఏమిటే? ఇది దేనికి సంకేతం? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. షా పర్యటన  వెనక ఏదో అనూహ్య రాజకీయ  వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గడచిన రెండున్నర సంవత్సరాలలో అమిత్ షాతొలిసారిగా రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించడమే కాకుండా, మళ్ళీ జనవరి (2022) లో వస్తానని  ఈలోగా అమరావతి రైతుల ఆందోళనలో పార్టీ నాయకులు ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటుగా, వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాలని క్లియర్ డైరెక్షన్’ ఇవ్వడంతో అమిత్  షా ఎత్తుగడ ఏమిటనే చర్చ జరుగుతోంది. 

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్వరం మారింది. కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ పైనా మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధాని మోడీని పేరు పెట్టి మరీ నానీలు తమ భాషలో విమర్శలు చేస్తున్నారు. మరో వంక జగన్ రెడ్డి  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ తో చేతులు కలిపి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు సాగిస్తునట్లు,ఇంటల్జెన్సీ వర్గాల సమాచారం ఉందని అందులో భాగంగా ఒరిస్సా ముఖ్యమంత్రితో రహస్య మంతనాలు సాగించడం వంటి, పరిణామాల నేపధ్యంలో  జగన్  రెడ్డికి  చెక్ పెట్టేందుకే, అమిత్ షా స్టేట్’లో  పావులు కదుపుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. అదే నిజం అయితే, జగన్ రెడ్డికి ముందుంది ముసళ్ళ పండగే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.