తమిళనాడు సీఎం విజయ్ నివాసం నీలాంకరి నుంచి వేదనియలంకు మార్పు.!?

Publish Date:Jul 14, 2026

Advertisement

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే  అధినేత విజయ్.. వేద నిలయంను తన నివాసంగా చేసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. చెన్నై నడిబొడ్డున ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన నివాసంలోకి మారేందుకు విజయ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నివాసం గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత  జె. జయలలిత అధికారిక నివాసం అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వేదనిలయాన్ని కొనుగోలు చేసే ఉద్దేశంలో విజయ్ ఉన్నట్లు చెబుతున్నారు.  . పోయెస్ గార్డెన్ (Poes Garden) లో ఉన్న ఈ చారిత్రాత్మక బంగ్లాను  350 కోట్లకు కొనుగోలు చేసి, ఆ భవనాన్ని తన నివాసంగా మార్చుకు ఉద్దేశంలో విజయ్ ఉన్నట్లు తమిళ మీడియాలో విస్తృతంగా ప్రచారమౌతోంది.  దాదాపు మూడు దశాబ్దాల పాటు తమిళనాడు రాష్ట్ర అధికార కేంద్రంగా, కీలక నిర్ణయాలకు వేదికగా నిలిచిన వేద నిలయం ఇప్పుడు  కొత్త రాజకీయ శకానికి సాక్ష్యంగా నిలవబోతుందా? అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది. 

 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక క్రమశిక్షణ గల పాలకుడిలా సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న విజయ్.. నీలాంకరి నుంచి ప్రతిరోజూ దాదాపు 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఈ సుదీర్ఘ ప్రయాణం కారణంగా చెన్నై నగరంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు సాధారణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ ట్రాఫిక్ కష్టాలకు స్వస్తి పలికి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికే సచివాలయానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉండే పోయెస్ గార్డెన్‌లోకి మారాలని విజయ్   నిర్ణయించుకున్నట్లు సమాచారం.

వేద నిలయం  24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో  ఉంది. దీనిని జయలలిత ఆమె తల్లి సంధ్యతో కలిసి 1967 జూలైలో కేవలం రూ. 1.32 లక్షలకు కొనుగోలు చేశారు. 1968 మే 15న గృహప్రవేశం చేసిన నాటి నుంచి 2016 డిసెంబర్‌లో ఆమె కన్నుమూసేంత వరకు ఈ నివాసమే తమిళ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండేది. అయితే జయలలిత మరణానంతరం ఈ ఇల్లు  న్యాయవివాదాల్లో చిక్కుకుంది. ప్రభుత్వ స్మారక కేంద్రంగా మార్చాలనే ప్రతిపాదనలు వచ్చినా..  సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత మద్రాసు హైకోర్టు దీనిని ఆమె వారసులైన జె. దీప, జె. దీపక్‌లకు అప్పగించింది. ఇప్పుడు విజయ్ ఈ ఇల్లు కొనుగోలు చేయడానికి సిద్ధమై  ఆ వారసులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  

poes garden house, jayalalithaa veda nilayam buying, vijay buy jaya home 350 crore, thalapathy vijay new residence chennai

By
en-us Political News

  
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.