Publish Date:Jun 26, 2022
తాగుబోతులంతా జీవితంలో వారి విలన్లను తిట్టుకుంటూ అరుస్తూ గోల చేయడం గమనిస్తుంటాం. కొందరు ఇంట్లో గోల చేస్తారు. చాలామంది ఇంటి బయట, రోడ్డు మీద గోల చేస్తూ అందరినీ ఇబ్బందిపెడుతుంటారు. లివర్‌పూల్‌లో అమీ నెవాల్ అనే 30 ఏళ్ల మహిళ తాగి నానా గొడవా చేస్తోందని జైల్లో పెట్టారు. ఇది జరిగి మూడు నెలలయింది. ఆమెను సెఫ్టాన్ మెజిస్ట్రీట్ కోర్టులకి తీసు కువచ్చారు. ఆమె ఎంతో బాధపడుతున్నట్టు నటించింది. ఏకంగా కోర్టుహాల్లో ఏడ్చేసి నన్ను క్షమించండి. ఇక నుంచి ఒక్క చుక్క కూడా తాగను, అసలు తాగేవారిని కూడా తంతాను. ఎక్కడికి వెళ్లినా అందరితో బాగా నడచుకుంటాను అంటూ ప్రాధేయ పడింది. అంతే ఆమె కన్నీళ్లకు జడ్జిగారు కరిగిపోయి క్షమించి వదిలేశారు.
ఆ ఆనందం తట్టుకోలేక కోర్టు హాల్లోనే గట్టిగా అరుస్తూ చిన్నపిల్లలా గోల చేసింది. ఆమె నిజంగానే చాలా మారిపోతుంది, ఆమె కోర్టుకు మాట ఇచ్చిందనే అనుకుంది కోర్టు. లాయర్లు ఎంతో సంతోషించారు. ఆమె తన ప్రవర్తన మార్చుకుని మంచి మహిళ అనిపించుకుంటుందని. కానీ వారి ఆశలు కొద్ది క్షణాలే బతికాయి. తర్వాత అమీ మామూలే!
అక్కడి నుంచి బయటకి వచ్చిన అమీ వెంటనే తన స్నేహితుల దగ్గరికి వెళ్లి కూటుగా మళ్లీ తాగింది. అక్కడా నవ్వుకుంది గట్టిగా. తాను కోర్టును ఏడిపించి నమ్మించానని! కానీ ఓ కుర్రాడు ఆ సీన్‌ని మొబైల్లో ఫైన్ పిక్చర్ అంటూ ఫోటో తీశాడు.
నిజానికి అంతకుముందు కూడా ఇలాంటి కేసులోనే జైలుకి వెళ్లింది. అక్కడ వున్నన్ని రోజులూ పోలీసుల్ని బాగా తిట్టేది. నీ తల పగలగొడతా, గాడిదా నన్ను అరెస్టు చేయడమేమిట్రా దొంగల్ని పట్టుకోవడం రాని వెధవల్లారా! అని తరచూ నోటికి వచ్చినట్టు కనిపించిన పోలీసుల్ని అందరినీ తిట్టేది. ఆమె చాలా దారుణంగా ప్రవర్తిస్తోందని రిహబిలిటేషన్ సెంటర్‌కీ పంపించారు. కానీ ఆమె పోలీసుల ముందు మహానటిలా నటించి అందర్నీ బోర్లాపడేసింది. ఆమె మాత్రం బీరు బాటిల్ చేత్తో పట్టుకుని గట్టిగా నవ్వు కుంది.
ప్రస్తుతం ఆమెను విడిచిపెట్టిన కోర్టు నిజానికి ఆమెను మళ్లీ పాత అలవాట్లతో జీవితంలో పాడయిపోకుండా నిబద్ధతతో జీవించేలా ఆమెపై గట్టి నిఘా పెట్టవలసింది అని కొందరు లాయర్లు, సామాజిక కార్యకర్తల మాట!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ami-only-acted-before-court-but-not-chanfed-39-138475.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.