ఇరాన్‌పై అమెరికా ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్.. కొత్త పేరుతో దాడులకు సమాయత్ం!

Publish Date:May 13, 2026

Advertisement

పశ్చిమాసియాలో మరోసారి  యుద్ధ మేఘాలు  కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన సైనిక వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే కొనసాగుతున్న ఘర్షణల మధ్య,   ఇరాన్‌పై మరింత తీవ్రస్థాయిలో విరుచుకుపడేందుకు అమెరికా రక్షణ శాఖ   ప్రణాళికలను సిద్ధం చేసింది.  ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్ అనే  పేరుతో భారీ సైనిక చర్యకు ఉపక్రమించనుంది. 

గత కొద్ది కాలంగా ఇరాన్‌పై అమెరికా చేపట్టిన  సైనిక చర్య ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ   కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే..  ఆ ఆపరేషన్ పెద్దగా ఫలించలేదు. పైపెచ్చు అమెరికా వ్యూహాల డొల్లతనం ప్రపంచానికి ప్రస్షుటమంది. దీంతో   ఈ ఆపరేషన్ పేరు  మార్చి మరింత పదునైన వ్యూహాలతో, మరింత తీవ్రమైన దాడులను చేపట్టాలని అగ్రరాజ్యాధినేత   ట్రంప్ నిర్ణయించారు. ప్రస్తుతం ఇరాన్ తో కాల్పుల విరమణ విఫలం అవుతున్న నేపథ్యంలో  ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్  పేర భారీ ఎత్తున వైమానిక,  క్షిపణి దాడులు చేపట్టేందుకు పెంటగాన్ సన్నాహాలు చేస్తోంది.

ఈ పేరు మార్పు వెనుక కేవలం వ్యూహాత్మక కారణాలతో పాటు..   చట్టపరమైన అంశాలు కూడా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా చట్టాల ప్రకారం.. ఏదైనా సుదీర్ఘ యుద్ధం కోసం కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. అయితే, కొత్త ఆపరేషన్ పేరును తెరపైకి తేవడం ద్వారా, ఇది ఒక కొత్త సైనిక చర్య అని వాదిస్తూ కాంగ్రెస్ ఆమోదం పొందే గడువును మరింత పెంచుకోవచ్చని ట్రంప్ యోచనగా పరిశీలకులు చెబుతున్నారు.  

ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పీక్స్ కు  చేరుకున్నాయి. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేయడం, మరోవైపు అమెరికా తన యుద్ధ నౌకలను మోహరించడంతో ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. ఇరాన్ తీరుపై ఆగ్రహంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్  కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. 

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అవసరమైతే ఆత్మరక్షణ కోసం దాడులు చేసేందుకు తాము వెనుకాడబోమని ఇటీవల స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ వైపు నుంచి ఏ  చిన్నపాటి కదలిక వచ్చినా,  ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్  పేరుతో ఆ దేశ అణు, సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులకు దిగే అవకాశం ఉందంటున్నారు.  

By
en-us Political News

  
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
అమెరికాతో పోటీ పడుతూ ప్రపంచలో శక్తివంతమైన దేశగా ఎదగాలనుకుంటున్న చైనాకు జనాభానే ప్రతిబంధంగా మారింది.
బెంగళూరు నగరంలో మానవత్వాన్ని మంటగలిపే ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్ల అరాచక, చీకటి పాలనకు తెరదించుతూ 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన అఖండ విజయం
ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారు కేవలం ఓట్లు వేయడమే కాకుండా, దేశ చరిత్రను తిరగరాయగల శక్తిమంతులని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి శ్రీధర్ నాయక్ (39) ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం రేపుతోంది.
కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదరైంది.
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీశైలంపై జీహెచ్‌ఎంసీ అధికారుల దాడి ఘటన సంచలనం రేపింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రగతి నివేదికను, భవిష్యత్ ప్రణాళికలను మీడియా వేదికగా ప్రకటించారు.
సాధారణ వినియోగదారుల కోసం కేటాయించిన సబ్సిడీ పెట్రోల్, డీజిల్ ను రిటైల్ ధరతో కొనుగోలు చేస్తూ పారిశ్రామిక రంగాలు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
సిడ్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో సింధూ చైనీస్ తైపీకి చెందిన చెన్ సు యూను 21-6, 21-9 తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ కేవలం 27 నిముషాలలో ముగించిన సింధు.. సెమీస్ లో జపాన్‌కు చెందిన టాప్ సీడ్ అకానె యమగుచితో తలపడనుంది.
రాష్ట్రం నుంచి నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్న లోకేష్ వారికి అభినందనలు తెలిపి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గట్టిగా గళం వినిపించాలని కోరానని పేర్కొన్నారు.
అట్రాసిటీ చట్టం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు..తన లేఖలో ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించారు. ఆ తీర్పు ప్రకారం క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారని, వారికి అట్రాసిటీ చట్టం కింద ఎలాంటి హక్కులు వర్తించవని గుర్తు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.