ఇరాన్ తో యుద్ధం కోసం అమెరికా చేసిన ఖర్చెంతో తెలిస్తే మైండ్ బ్లాక్ ఖాయం.!

Publish Date:Jul 21, 2026

Advertisement

ఇరాన్‌తో  అమెరికా చేస్తున్న  యుద్ధం మిడిల్ ఈస్ట్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ యుద్ధంతో అమెరికా కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ యుద్ధం కోసం, యుద్ధాన్ని కొనసాగించడం కోసం అమెరికా ఎంత ఖర్చు చేసిందో తెలుస్తే మైండ్ బ్లాక్ కావడం ఖయం.  ప్రపంచానికి పెద్దన్నగా తనను తాను అభివర్ణించుకునే అమెరికా ఇరాన్ సంబంధిత సైనిక చర్యల కోసం అక్షరాలా 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది ఇండియన్ కరెన్సీలో  3.6 లక్షల కోట్లు.  పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధం గల్ఫ్ ప్రాంతంలో నిరంతరం సాగుతున్న రాకెట్లు, డ్రోన్లు, క్షిపణి దాడులు అమెరికా ఖజానాను దాదాపుగా ఖాళీ చేస్తున్నాయి. అలాగే అమెరికా రక్షణ రంగాన్ని ఈ యుద్ధం డిఫెన్స్ లో పడేసింది. అమెరికా అహంకారంలోని డొల్ల తనాన్ని ఈ యుద్ధం ప్రపంచానికి చాటింది. 

  అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ సెనేట్ అప్రాప్రియేషన్స్ కమిటీ ఎదుట స్వయంగా హాజరై ఇరాన్ తో యుద్ధం కోసం ఎంత వ్యయం చేయాల్సి వచ్చిందో గణాంకాలతో సహా వెల్లడించారు. సెప్టెంబర్ 30తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఈ యుద్ధ వ్యయం ఇంకా భారీగా పెరుగుతుందని కూడా ఆయన అప్రాప్రియేషన్స్ కమిటీ  ఎదుట అంగీకరించారు. మే, జూన్ నెలల్లో వేసిన అంచనాల ప్రకారం ఈ వ్యయం 29 బిలియన్ల నుంచి 30 బిలియన్ డాలర్లుగా ఉంటుందని భావించినా.. అది వాస్తవంగా 37.5 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం.   యుద్ధ తీవ్రత, క్షిపణుల వాడకం అనూహ్యంగా పెరగడమే ఇందుకు కారణమని ఆయన వెల్లడించారు. 

రక్షణ అవసరాలు, ఆయుధ రీప్లేస్‌మెంట్ కోసం అత్యవసరంగా మరో  67 బిలియన్ డాలర్ల అదనపు రక్షణ నిధులను కేటాయించాలని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్‌తో కలిసి పీట్ హెగ్‌సెత్ డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తరఫున సెనేట్‌ను అభ్యర్థించారు. సైనిక బలగాల సంసిద్ధతను కాపాడుకోవడానికి   నిధులు అత్యవసరమన్నారు.  నిధులు వెంటనే మంజూరు కాకపోతే, అమెరికా సైనిక శిక్షణా కార్యక్రమాలను పరిమితం చేయాల్సి వస్తుందనీ, ఇంు వల్ల   నిర్వహణ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.   

Pete Hegseth US Iran war, US military spending Iran, Strait of Hormuz conflict, Pentagon defense budget 

By
en-us Political News

  
హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ప్రాపర్టీని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం వేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే బండ్ల గణేష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్ధించింది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో తాజాగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
భద్రత దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవని పేర్కొంది. ఆయా మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికుల ప్రవేశం, నిష్క్రమణను కూడా నిలిపివేసినట్లు తెలిపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.