కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందని ప్రపంచం అంతా ధీమాగా ఉంది. ప్రజలు కరోనా జాగ్రత్తలను గాలికి వదిలేశారు. ప్రయాణ ఆంక్షలు లేవు. భౌతిక దూరం పాటించడమన్న మాటే మర్చిపోయారు. శానిటైజన్ల వాడకం తగ్గిపోయింది. మాస్కుల మాట చెప్పనే అక్కర్లేదు. అయితే కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోలేదనీ, ప్రపంచ వ్యాప్తంగా కేసులలో గణనీయ పెరుగుదల కనిపిస్తోందనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది.
ఇప్పటికే చైనాలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పలు దేశాలలో కూడా ఈ మహమ్మారి వ్యాప్తి చాపకింద నీరులా ఉందని వార్తలు వస్తున్నాయి. మరో సారి కరోనా జాగ్రత్తల గురించి ప్రపంచ దేశాలు పట్టించుకోక తప్పని అనివార్యత ముందు ముందు ఎదురు కావచ్చునని అంటున్నారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తికి కారణమైన చైనాలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు బయటపడుతుండటంతో.. అక్కడి ప్రజలు ముందు జాగ్రత్తగా వెంటిలేటర్లు, ఆక్సిజన్ మెషీన్లను కొనుగోలు చేస్తున్నారు.
ఇక తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ట్వీట్ చేశారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని బిల్ క్లింటన్ తెలిపారు. వ్యాక్సిన్, బూస్టర్ డోస్ వేయించుకోవడం వల్ల కరోనా తీవ్రత తక్కువగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్, బూస్టర్ డోసులు వేయించుకోవాలని సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/america-former-president-clinton-tested-corona-posative-25-147960.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.