వేషం మారింది సరే.. మరి భాషో.. అంబటి కొత్త అవతారం
Publish Date:Apr 3, 2025
.webp)
Advertisement
వైసీపీలో సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు అందరూ సైలెంట్ అయిపోగా.. మాజీ మంత్రి, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాత్రం తన నోటికి పని చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో గట్టిగా మాట్లాడుతున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది అంబటి మాత్రమే. అటువంటి అంబటి రాంబాబు బుధవారం(ఏప్రిల్ 2) కొత్త అవతారంలో కనిపించారు. రాజకీయ నాయకుడిగా ఎప్పుడూ ఒకే ఆహార్యంతో కనిపించే అంబటి రాంబాబు తాజాగా నల్ల కొటు ధరించి న్యాయవాది అవతారం ఎత్తారు. హైకోర్టులో తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను తానే స్వయంగా వాదించుకుంటానంటూ న్యాయవాది దుస్తులలో ఆయన కోర్టుకు వచ్చారు. తన పిటిషన్ ను తానే వాదించుకునేందుకు అంబటి కోర్టు అనుమతి కూడా పొందారు.
ఇంతకూ ఆయన వాదించుకోబోయే పిటిషన్ ఏదంటే.. గత ఏడాది నవంబర్ లో అంబటి రాంబాబు, ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో కొందరు అనుచిత పోస్టులు పెట్టారట. దీనిపై గుంటూరు పట్టభిపురం పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా అనుచిత పోస్టులకు సంబంధించి నాలుగు, వైసీపీ అధినేత జగన్ ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులకు సంబంధించి మరో ఫిర్యాదు మొత్తం ఐదు ఫిర్యాదులను అంబటి చేశారు. ఆ ఫిర్యాదులలొ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టుల ఫిర్యాదు మినహా మిగిలిన నాలుగు ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
జగన్ విషయంలో తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో అంబటి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. అలాగే కేసులు నమోదు చేసిన నాలుగు ఫిర్యాదులలోనూ కూడా తాను ప్రస్తావించిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు,లోకేష్ పేర్లు లేవంటూ అంబటి తన రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ విషయంలోనే తాను వాదించుకుంటానంటూ అంబటి న్యాయవాది వేషధారణలో హైకోర్టుకు హాజరయ్యారు. అయితే..
http://www.teluguone.com/news/content/ambita-new-look-39-195552.html












