జీవితం చెక్కిన మానవతామూర్తి అంబేడ్కర్

Publish Date:Apr 13, 2023

Advertisement

ఏప్రిల్ 14.. స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక మరపురాని రోజు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీమ్ రావ్ అంబేడ్కర్ జయంతి. ప్రతి ఏటా ఈ రోజున దేశ వ్యాప్తంగా అంబేడ్కర్  జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అంబేడ్కర్ జయంతి వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
 ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఈఏడాది వేడుకలకు మంరింత ప్రత్యేకత తోడైంది. గత సంవత్సరం అంబేడ్కర్ 125 జయంతి వేడుకల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్  లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంబేద్కర్ పేరున నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు ( ఏప్రిల్ 14) న ఆవిష్కరిస్తున్నారు.

 అయితే విగ్రహాన్ని అవిష్కరించడం ఒకటైతే, అంబేడ్కర్’ ఆశయాలను ముందుకు తీసుకుపోవడం మరొక విషయం. ముఖ్యంగా అంబేడ్కర్  రాజ్యాంగానికి కాలం చెల్లిందనే భావన వ్యక్తమవుతున్న నేపధ్యంలో,ఈ జయంతి వేడుకలను కేవలం వేడుకలుగానే కాకుండా అంబేడ్కర్  ఆశలు, ఆశయాలతో పాటుగా, రాజ్యాంగం మంచి చెడులపై వివేచనతో కూడిన చర్చజరిగితే అది మంచిందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తపరుస్తున్నారు. నిజానికి అంబేడ్కర్  రాజ్యాంగాన్ని సమీక్షించ వలసిన సమయం వచ్చిందని, ఎవరో కాదు,తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో చాలా దృఢమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాదు  దేశంలో అతి పెద్ద మార్పు రావలసిన అవసరం ఉందని, అందుకు అంబేడ్కర్  రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగం రావలసిన అవసరం ఉందని కూడా అన్నారు. అప్పట్లో  ముఖ్యమంత్రి కేసేఅర్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శకు గురయ్యాయి. 

అయితే అప్పట్లో  కేసేఆర్, అంబేడ్కర్  పై వ్యాఖ్యలు చేసిన సమయ సందర్భాలను పక్కన  పెట్టి,  స్వయంగా అంబేడ్కర్  రాజ్యాంగాన్నితగల బెట్టాలని అన్నారని తమ వాదనను గట్టిగా సమర్ధించుకున్నారు. అయితే,అదే కేసీఆర్  ఈరోజు అంబేద్కర్ జయంతి సందేశంలో మాత్రం రాజ్యాంగ ప్రస్తావన చేయలేదు. వివాదాల జోలికి వెళ్ళలేదు. సందర్భోచితంగా, అంబేడ్కర్  గోప్పతాన్ని మెచ్చుకున్నారు.   దేశ భవిష్యత్ కు సంబంధించి గొప్ప ఆలోచనలు చేస్తూ గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వ మానవుడు అంబేద్కర్  అని కొనియాడారు.  సమాజంలో అజ్ఞానాంధకారాలను చీల్చి జ్ఞానపు వెలుగులు అందించిన మేధావి  అంబేడ్కర్ అని అన్నారు. 

అలాగే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా  ఇచ్చిన సందేశంలో  కేసీఆర్, గతానికి భిన్నంగా  సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చటంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఎంతటి కష్టమైన పనైనా చిత్తశుద్ధితో … పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని అంబేడ్కర్ జీవితం నేర్పిస్తుంది. అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఆయన ఎదుర్కొని జీవించిన విధానం ఎంతోమందికి మార్గదర్శకం.  అని పేర్కొన్నారు. 

ఆయన రచనలు, ప్రసంగాలు   ఆలోచింపజేస్తాయి.దేశంలో సమాన హక్కుల కోసం జీవితాంతం పరితపించి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారు.నేడు అణగారిన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలు అంబేద్కర్ సమకూర్చినవే అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.అయితే కేసీఆర్ ఎప్పుడు ఏమన్నారు అనే విషయాన్ని పక్కన పెడితే, రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా, అంబేడ్కర్ ఒక మనిషిగా, మానవతా వాదీగా చరిత్ర పుటల్లోనే  కాదు, భారతీయుల హుదయాల్లో చిరస్మరణీయంగా నిలిచి పోతారు. 

ప్రధాని నరేంద్ర మోడీ అన్నట్లుగా జీవితం చెక్కిన సంపూర్ణ మానవతామూర్తి అంబేడ్కర్. అవును, 1891 ఏప్రిల్ 14న మది ప్రదేశ్ లో జన్మించిన అంబేద్కర్,జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్ ను అంటరానివాడిగా చూశారు. స్కూల్కు వెళ్లినా వేరేగా కూర్చోవల్సిన పరిస్థితి. ఒక్కోసారి క్లాసులో కూర్చోనిచ్చేవారు కాదు.ఇన్ని కష్టాల మధ్య అంచెలంచెలుగా ఎదిగిన అంబేడ్కర్.. ఒక గొప్ప ఆర్థిక వేత్తగా, న్యాయకోవిదునిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత అంబేడ్కర్ సొంతం. అందుకే, ఎవరు ఏమన్నా ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.

అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.