వైసీపీలో అంబటి వర్సెస్ ముద్రగడ.. ఎందుకంటే?

Publish Date:Apr 6, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపు ఓటు బ్యాంకుకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడమే లక్ష్యంగా వైసీపీ చాలా సీరియస్ గా పావులు కదుపుతోంది. కాపు ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు అంబటి తనదైన స్టైల్ లో చేయగలిగినన్న ప్రయత్నాలూ చేస్తున్నారు. కాపులలో సానుభూతి పొందేందుకూ, వారికి దగ్గరయ్యేందుకు ఆయన ఏకంగా జైలుకు వెళ్లి వచ్చారు. ఇలా ఆయన జైలుకు వెళ్లారో లేదో.. అలా వైసీపీయులు ఆయనను కాపు నేత అంటూ ఆకాశానికి ఎత్తేశారు.  అక్కడితో ఆగకుండా ఏకంగా దివంగత వంగవీటి రంగాతో సమానమైన నాయకుడంటూ పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు.  

ఈ నేపథ్యంలోనే పార్టీలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి  తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.  ఇందుకు   తార్కానాలు కూడా చూపుతున్నారు. 

ఇటీవల అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన , అంబటిని ముద్రగడ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు.  కాపు నాయకుడిగా అంబటి తన తరువాతే అని చాటేందుకే ముద్రగడ అంబటి నివాసానికి వెళ్లి పరామర్శ పేరుతో తనను తాను కాపు లీడర్ గా ప్రొజెక్ట్ చేసుకున్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  కాపు సామాజిక వర్గంలో ఎవరైనా సరే తనతో సమానంగా కానీ, తనను మించి గానీ పేరు తెచ్చుకోవడాన్ని ముద్రగడ జీర్ణించుకోలేరని ఆ సమాజికవర్గంలోనే టాక్ ఉంది. ముద్రగడ జనసేనాని పవన్ కల్యాణ్ ను వ్యతిరేకించడానికి ప్రధాన కారణం అదేనని కూడా అంటారు. 

 ఇక ప్రస్తుతానికి వస్తే.. కాపు నేతలను ఏకం చేస్తాననీ, వారిని వైసీపీ వైపు తీసుకువస్తానని ఇటీవలి కాలంలో ముద్రగడ అడిగిన వారీకి అడగని వారికీ కూడా అదే పనిగా చెబుతున్నారట. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం, జనసేప పార్టీలలో ఉంటూ.. సరైన గుర్తింపు లేదన్న అసంతృప్తితో ఉన్న నాయకుల కోసం గాలిస్తున్నారట. అటువంటి నాయకులతో సమావేశాలు నిర్వహించి, వారిని వైసీపీలోకి ఆహ్వానించాలన్నదే ఆయన వ్యూహంగా చెబుతున్నారు.  

అయితే ఇక్కడ ముద్రగడకు ఎదురైన చిక్కు ఏమిటంటే.. ఆయన ప్రయత్నాలకు వైసీపీయుల నంచే వ్యతిరేకత వస్తున్నది. ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గాల కాపు కోఆర్డినేటర్లు ఈ విషయంలో ముద్రగడను బలంగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.  ఇప్పుడు కూటమిలోని కాపు నేతలన పార్టీలోకి ఆహ్వానించి తన పదవులకు, ఉనికికి ముద్రగడ ఎసరుపెట్టేలా ఉన్నారన్నదే వారి వ్యతిరేకతకు కారణమంటున్నారు.

ఇక్కడే వారు ముద్రగడ తన పేరును పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతిని గుర్తు చేస్తూ.. తగుదునమ్మా అని ఇప్పుడు కాపులను ఏకం చేస్తాననడమేంటని ప్రశ్నిస్తున్నారు.  ఆయన ప్రయత్నాలు పార్టీకి చెడ్డపేరు తీసుకురావడమే కాకుండా, కాపు సామాజికవర్గాన్ని వైసీపీకి దూరం చేస్తాయని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో కాపు సామాజికవర్గానికి లీడర్ ఎవరు అన్న విషయంలో అంబటి వర్సెస్ ముద్రగడగా సీన్ మారిందని వైసీపీలోనే గట్టిగా వినిపిస్తోంది. చూడాలి మరి ఈ రేస్ లో ఎవరు గెలుస్తారో?  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.