రావణుడినే గెలిపిస్తాం.. అంబటి.!

Publish Date:Jul 11, 2026

Advertisement

ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్ వ్యవహారం వైసీపీ తీరు రోజుకో రకంగా మారుతోంది.   ప్రశ్న రావణ్ విషయంలో వైసీపీ ఎప్పుడు ఏం మాట్లాడుతోంది, ఏ క్షణంలో ఏ ప్రకటన చేస్తుందన్న విషయం ఆ పార్టీకైనా తెలుసా? అన్న అనుమానాలు పోలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమౌతున్నాయి.   ఈ క్రమంలోనే  వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా చేసిన   వ్యాఖ్యలు మరో వివాదానికి తెరలేపాయి.  ప్రశ్న రావణ్ కేసుపై స్పందించిన అంబటి రాంబాబు..  రావణుడే గెలుస్తాడు.. మేము గెలిపిస్తాం అంటూ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. 

వాస్తవానికి గత కొద్దిరోజులుగా ప్రశ్న రావణ్ ఎపిసోడ్‌లో వైసిపి సోషల్ మీడియా  తీవ్ర అయోమయంలో పడినట్లు కనిపించింది. ఒక దశలో ప్రశ్న రావణ్ గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడిన పాత వీడియోలను షేర్ చేస్తూ, అతను టిడిపి సానుభూతిపరుడంటూ వైసిపి ప్రచారం చేసింది. ఇప్పుడు..  ఇప్పుడు మాట మార్చి ప్రశ్న రావణ్ ను వెనకేసుకొస్తూ వైసీపీ అగ్రనేతలు మాట్లాడుతున్నారు.  ఒకరోజు టిడిపి మనిషి అని ముద్ర వేసి, ఆ మరుసటి రోజే అతనికి పూర్తి స్థాయిలో అండగా నిలబడటం విస్మయ పరుస్తోంది. పైగా మాజీ మంత్రి అంబటి ఒక అడుగు ముందుకు వేసి.. రావణుడిని గెలిపిస్తామనడం వివాదాస్పదంగా మారింది.  ప్రశ్న రావణ్ భావజాలానికీ, వైసీపీ సిద్ధాంతాలకూ సంబంధం లేదన్న అంబటి..  అతని మీద అన్యాయంగా కేసులు పెట్టి సోషల్ మీడియా గొంతు నొక్కాలని,చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. ఈ  యుద్ధంలో రావణుడే గెలుస్తాడు.. రావణుడిని  మేము గెలిపిస్తామన్నారు.  

సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన ద్వేషాన్ని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాడనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు గత వారం ప్రశ్న రావణ్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే.   సమాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రావణుడిని గెలిపిస్తామనడమంటే.. తాము రాక్షసుడి పక్కన నిలబడినట్లు అంగీకరించడమే అవుతుందని చెబుతున్నారు.  మొత్తం మీద అంబటి రాంబాబు రావణుడిని గెలిపిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ ట్రోల్ అవుతున్నాయి.  

Ambati Rambabu, Prashna Ravan, YCP Strategy, Prashna Ravan Arrest, AP Political News, Telugu YouTuber Arrest

By
en-us Political News

  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.