అంబటి పాదయాత్ర హాల్ట్.. కారణం ఏంటో తెలుసా?

Publish Date:Aug 6, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జగన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారని ఆ పార్టీ శ్రేణుల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  గుంటూరులోని తన నివాసం నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వరకూ రెండు రోజులు వినతి యాత్ర పేరిట అంబటి రాంబాబు తలపెట్టిన పాదయాత్ర చివరి నిముషంలో  రద్దైంది. పైకి రద్దు కాదు తాత్కాలిక వాయిదా అని చెబుతుంటే.. తన అనుమతి లేకుండా పాదయాత్రా అంటూ జగన్ కన్నెర్ర చేయడం వల్లే అంబటి తన పాదయాత్రను రద్దు చేసుకున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.  

తన ఇంటిపై జరిగిన దాడి ఘటనలో నిందితులను అరెస్ట్ చేయడం లేదని ఆరోపిస్తూ అంబటి ఈ పాదయాత్ర తలపెట్టారు.  కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.

 అంబటి రాంబాబు తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడానికే పాదయాత్ర ప్రకటన చేశారని జగన్ భావించారని అంటున్నారు. ఇలా సొంత ప్రయోజనాలు, గుర్తింపు కోసం పాదయాత్రలూ, ఆందోళనలూ చేపట్టడం ఏమిటని అంబటిని నిలదీసినట్లు చెబుతున్నారు.  అధిష్ఠానం రూపొందించిన కార్యక్రమాలకే పరిమితం కావాల తప్ప.. ఇలా వ్యక్తిగత ఇమేజ్ కోసం పాదయాత్రలు, ఆందోళనలు కూడదని నిష్కర్షగా చెప్పడంతో  అంబటి తన పాదయాత్రను విరమించుకున్నట్లు సమాచారం.   అయితే జగన్ ఆగ్రహం గురించి బయటకు చెప్పుకోలేక.. డీఎస్సీ నిరసనలకు పార్టీ హైకమాండ్ పిలుపు నివ్వడంతో వాటికి తన పాదయాత్ర అడ్డం కాకూడదన్న ఉద్దేశంతోనే తాత్కాలికంగా విరమించినట్లు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు.  

Ambati Rambabu Padayatra canciled, Ambati Vinathi Yatra, Ambati Rambabu Protest Postponed, AP Politics, DGP Office March, Telugu One

By
en-us Political News

  
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. 
ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.