జగన్ మళ్లీ సీఎం అయ్యే అవకాశమే లేదా? అంబటి చెబుతున్నది అదేగా?
Publish Date:Aug 8, 2026
Advertisement
జగన్ ఇక ఎప్పటికీ సీఎం కాలేరా? ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తర్కబద్ధంగా తొడగొట్టి మరీ చెప్పిన 40 శాతం ఓటు షేర్ సంకేతం అదేనా? ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఇప్పుడు ఇదే విషయమై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు. ఇప్పటికీ ఆ ఓట్ షేర్ తమకు పదిలంగా చెక్కుచెదరకుండా ఉందన్నారు. ఆ ఓటు షేర్ తో రాబోయే రోజుల్లో జగన్ నేతృత్వంలో వైసీపీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని తొడగొట్టి మరీ చెప్పారు. అయితే ఆయన చెప్పిన 40 శాతం ఓటు షేరు లెక్కలను బట్టి చూస్తే.. జగన్ ఎన్నటికీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేరని పరిశీలకులు అంటున్నారు. అంబటి 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పొందిన ఓటు షేర్‌తో తమ పార్టీ ఓటు షేర్‌ను పోల్చి మాట్లాడారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ వైసీపీ 40 శాతానికి పైగా ప్రజల ఆమోదాన్ని నిలబెట్టుకుందన్నారు. కేవలం గెలిచిన అసెంబ్లీ సీట్ల సంఖ్యను బట్టి ఒక పార్టీ ప్రజాదరణను అంచనా వేయలేమని, నేటికీ రాష్ట్రంలోని కోట్లాది మంది ఓటర్లు జగన్ సంక్షేమ పాలనపై, ఆయన నాయకత్వంపై చెక్కుచెదరని విశ్వాసంతో ఉన్నారన్నారు అంబటి. కానీ వాస్తవానికి.. రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిధులలో.. ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేవలం ఒక శాతం ఓట్ల తేడా సరిపోతుంది. అంతే కాకుండా.. మొత్తం ఓట్ షేర్ కంటే.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుచుకున్న సీట్ల సంఖ్య గెలుపు నిర్ణయిస్తుంది. దీనిని బట్టి అంబటి రాంబాబు రాంబాబు చెబుతున్న ఓట్ షేర్ లెక్కల , వైసీపీ తమకున్న 40శాతం ఓట్ల వాటాతో తెలుగుదేవం కూటమి ఐక్యంగా ఉన్నంత కాలం జగన్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేనేలేదన్న మాటే. కాంగ్రెస్, వైఎస్ లెగసీ నుంచి సంప్రదాయబద్ధంగా వచ్చే 40శాతం ఓట్ షేర్ తో జగన్ అధికారంలోకి వచ్చే అవకాశలే లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే తమ 40 శాతం ఓటు షేరుతో హ్యాపీగా ఉన్నామంటూ అంబటి చెబుతున్న దానిని బట్టి చూస్తే జగన్ సీఎం ఆశలు వదలిలేసుకున్నట్లేగా? Ambati Rambabu 40percent vote share narrative, YS Jagan, CM dream neverfullfill, YSR Congress Party, AP Politics, TeluguOne
http://www.teluguone.com/news/content/ambati-rambabu-40percent-vote-share-narrative-25-228408.html





