సవాళ్లతో హోదాలు రావు అంబటీ.!

Publish Date:Aug 14, 2026

Advertisement

పార్లమెంటులోనైనా, అసెంబ్లీలోనైనా ప్రతిపక్ష పార్టీ హోదా, ప్రతిపక్ష నేత హోదా అనేది అడుక్కుంటేనో, దబాయిస్తేనొ రాదు. ఆ హోదా కావాలంటే సభలో మొత్తం స్థానాలలో కనీసం పది శాతం స్థానాలు ఉండాలి. అంటే జనం మీకు ఆ అర్హత ఉందని ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలలో పార్టీని గెలిపించాలి.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.   నింబంధనల ప్రకారం విపక్ష నేతగా తనకు లేని, రాని హోదాను కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. అది పక్కన పెడితే.. విపక్ష హోదా ఇచ్చే వరకూ తాను కానీ, తన పార్టీ సభ్యులు కానీ అసెంబ్లీలో అడుగుపెట్టబోమంటూ శపథం చేశారు. ఇది చెరువుమీద కోపం వచ్చి ఏదో చేసినట్లుగా ఉందంటూ నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు. అది వేరే సంగతి. రాని హోదా కోసం అసెంబ్లీకి గైర్హాజరైతే నష్టం వైసీపీకే . సభకు గైర్హాజర్ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఉన్న అవకాశాన్ని ఆ పార్టీ కోల్పోతోంది. 

 ఇక పోతే ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి ఇంకో అడుగు ముందుకు వేసి దమ్ముంటే జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. 
ఈ సవాల్ విసిరి ఆయన మరో సారి రాజకీయ జోకర్ గా నవ్వుల పాలయ్యారు. ముందే చెప్పినట్లు ప్రతిపక్ష నేత హోదా అయినా, ప్రతిపక్ష పార్టీ హోదా అయినా అడుక్కుంటేనో, దబాయిస్తేనే రాదు. ఆ హోదా ప్రజలు ఇవ్వాలి. కానీ వైసీపీని ప్రజలు గత ఎన్నికలలో పూర్తిగా తిరస్కరించారు. విపక్ష స్థాయి కూడా లేదని పక్కన కూర్చోపెట్టారు. అలా కాకుండా సవాళ్లు విసిరో, బతిమలాడుకునో ప్రతిపక్ష హోదాయో మరోటో దక్కించుకునే అవకాశమే ఉంటే.. రాహుల్ గాంధీ దమ్ముంటే నాకు ప్రధాని హోదా ఇవ్వండి అంటూ మోడీకి సవాల్ విసిరి ఆ పదవిని దక్కించేసుకోవచ్చు కదా?

అంబటికి అర్ధంకానిదీ, అర్ధం చేసుకోవలసిందీ ఏమిటంటే..  ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి ఏ హోదా అన్నది నిర్ణయించేది ప్రజలు, వారి తీర్పును కాదని ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. అలాగని ప్రతిపక్షంలోనూ కూర్చోలేదు. ప్రజలు ఏం నిర్ణయించాలో అది శిరసావహించడమే రాజకీయపార్టీలైనా, నాయకులైనా చేయాలి. పదవులు, హోదాలూ సవాళ్లతోనో, దేబిరింపులతోనో రావు. సవాళ్లు చేసినంత మాత్రాన, బతిమలాడుకున్నంత మాత్రానా రాజ్యాంగ నిబంధనలు మారవు. 

ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి ఏ హోదా ఇవ్వాలనేది ఎదుటి ప్రత్యర్థి ప్రభుత్వం నిర్ణయించదు.. ఓట్లేసే ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజా తీర్పు ఆధారంగానే చట్టసభల్లో స్థానాలు, పదవులు నిర్ణయమవుతాయి తప్ప, వీధి పోరాటాల సవాళ్లతో రాజ్యాంగ నిబంధనలు మారవు.

Ambati Rambabu,  Opposition Leader Status, hallange, YS Jagan,  YCP, Andhra Pradesh Assembly, TeluguOne 

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.