జమిలి ఎన్నికలు.. అంబటి దింపుడు కళ్లెం ఆశ!

Publish Date:Mar 4, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పొలిటికల్ జర్నీ దయనీయంగా మారిపోయింది. ప్రజా సమస్యలపై ఆ పార్టీ పోరాటాలకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా జనం నమ్ముతారన్న నమ్మకం ఆ పార్టీ నేతలు, శ్రేణులకే లేదు. లేని, రాని హోదా కోసం పట్టుబడుతూ అసెంబ్లీని బహిష్కరించేశారు. దీంతో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలంతా రాసుకొచ్చిన స్క్రిప్ట్ ను మీడియా సమావేశాలలో చదవడానికే పరిమితమైపోయారు. ఇక అంబటి వంటి మాజీ మంత్రులు అడపాదడపా మీడియా ముందుకు వచ్చి చేస్తున్న విమర్శలు పట్టించుకునే వారే లేని పరిస్థితి ఉంది. 

అసలు గత ఎన్నికలలో ఓటమి తరువాత నుంచీ ఆ పార్టీ ఓటమికి కారణం ప్రజాగ్రహం కాదని చెప్పుకుని సంతృప్తి పడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. తమకు 40 శాతం ఓట్లు పడ్డాయనీ, తమ ఓటమికి ఈవీఎం ట్యాంపరింగే కరణమనీ తొలి రోజుల్లో చెప్పుకుంది. అయితే ఈవీఎం టాంపరింగ్ గురించి జగన్ అండ్ కో మాట్లడటంపై జనం నవ్వి పోయారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ మాట ఎత్తడం లేదు. ఇప్పుడో కొత్త రాగం అందుకుంది. మూడేళ్లలో జమిలి ఎన్నికలు రానున్నాయి, ఆ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పుకుంటోంది. తాజాగా వెలువడిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో పోటీకి జగన్ పార్టీ దూరంగా ఉన్నప్పటికీ, ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులను జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అయినా వైసీపీయులు జమిలిలో జయం మాదే అంటూ జపం చేస్తున్నారు.  

అక్కడితో ఆగడం లేదు.. ఇంతకు ఇంతా చేస్తామంటూ తొడలు చరుస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జమిలి ఎన్నికలు వస్తాయనీ, ఆ ఎన్నికలలో  విజయం మాదేననీ ధీమాగా చెబుతూ.. మేం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందన్నారు.  

ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించిన అంబటి.. జగన్ హయాంలో ఎన్నడూ ఇలా జరగలేదంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు  చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ ఆయనకు చెప్పు చూపించారనీ, ఆయినా అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చట్టపరమైన చర్యలూ తీసుకోలేదన్నారు. అలాగే ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు అప్పట్లో జగన్ ను దుర్బాషలాడినా ఆయనపైనా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అదే విధంగా చంద్రబాబు సైతం గతంలో పలుసార్లు జగన్ ను దూషించారనీ, అయినా వారెవరిపైనా అప్పటి జగన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని అంబటి రాంబాబు చెప్పారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తూ.. జమిలి ఎన్నికలలో విజయం సాధించి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనీ, అప్పుడు ఇంతకు ఇంతా అనుభవించక తప్పదని హెచ్చరించారు.  ఇప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు.   

అయితే అంబటి మాత్రం జగన్ ఐదేళ్ల పాలనలో అధికారం ఏ స్థాయిలో దుర్వినియోగమైందో ససాక్ష్యంగా కళ్లెదుట కనిపిస్తున్నా చూడటానికీ, గుర్తించడానికీ సిద్థంగా లేరు. అయితే ఆ అధికార దుర్వినియోగన్నీ, దౌర్జన్యాలను, దుర్మార్గాలనూ జనం గత ఎన్నికలలో ఓటు ద్వారా తిరస్కరించిన కారణంగానే వైసీపీ ఇప్పుడు కనీసం విపక్ష హోదా కూడా లేకుండా మిగిలిందన్న వాస్తవాన్ని అంబటి గుర్తుంచుకోవాల్సి ఉంది. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.