Publish Date:Jun 13, 2026
వైసీపీ అనుచిత వ్యాఖ్యల పర్వం కోనసాగుతోంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రిపై అభ్యంతరకర పదజాలంతో మాట్లాడినందుకు అంబటి రాంబాబు అరెస్టు అయ్యి, బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న అంబటి ఇప్పుడు మరో సారి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలతోరెచ్చిపోయారు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో భాగంగా ఒక ధర్నాలో పాల్గొన్న అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నిరసనల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన అంబటి.. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాడిని ఎప్పుడో తగలేశారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ మర్యాదలను, నైతిక విలువలను పూర్తిగా కాలరాయడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంబటి రాంబాబు ఈ రకంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన బహిరంగ సభల్లో, మీడియా సమావేశాలలో పలు మార్లు హద్దులు దాటి మాట్లాడారు.
గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల వల్లే గుంటూరు కోర్టు పరిధిలో ఆయనపై కేసులు నమోదై, తీవ్ర చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కొని జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే పంథాలో బహిరంగంగా ముఖ్యమంత్రిని దూషించడంతో.. అంబటి రాంబాబును తక్షణమే అరెస్ట్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ambati-crosses-line-again-25-222806.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.