హైదరాబాద్‌ను మించి రాజధాని అమరావతి.. చంద్రబాబు

Publish Date:Mar 29, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ కుఅమరావతి ఒక్కటే రాజధాని అని చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం (మార్చి 29) ఘనంగా జరిగాయి.  ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..  సామాన్య కార్యకర్తలను, వెనుకబడిన వర్గాల వారిని గుర్తించి వారిని చట్టసభలకు పంపించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు.

ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో, భవిష్యత్తులో అమరావతిని హైదరాబాద్‌ను మించిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వాసులకు హామీ ఇచ్చారు.  రాజధాని అభివృద్ధిని అడ్డుకునే శక్తులను, వ్యతిరేకించే వారిని అక్కడకు రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

ఇకపై  మూడు ముక్కలాట  ఉండదన్నారు. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ శక్తి మాత్రమే కాదని, అది తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన ఒక గొప్ప వ్యవస్థ అన్న చంద్రబాబు..  పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు అనేక చారిత్రాత్మక రికార్డులు నెలకొల్పామని   గుర్తుచేశారు. 

By
en-us Political News

  
దెందులూరు నియోజకవర్గంలో ఏమి జరుగుతుంది..
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశం
కాక్రోచ్ పార్టీ కేవలం ఒక నిరసన వేదికగా కాకుండా, కాక్రోచ్ జనతా పార్టీగా రూపాంతరం చెందుతూ యువతను విశేషంగా ఆకర్షిస్తోంది.
మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామానికి చెందిన వైసీపీ నేత కొత్తపల్లి మోహన రావు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
కూటమి రెండేళ్ల పాలనపై ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు.
గత ఎన్నికల్లో దూరమైన సామాజికవర్గాలను తిరిగి దగ్గర చేసుకోవడానికి వైసీపీ కుట్ర రాజకీయాలకు తెర లేపుతోంది.
రాజకీయ ముసుగు వేసుకుని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే వికృత ధోరణిని తాము సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసే ముందు, తమ ఇళ్లలో కూడా మహిళలు, తల్లులు, చెల్లెళ్లు ఉన్నారనే కనీస విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.
నిత్యం లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ట్రయాంగ్యులర్ పోరుకు వేదిక అయ్యింది. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది.
తన రాజీనామాను ఆయన శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను స్వయంగా కలిసి అందజేశారు. ఆ రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు.
ఢిల్లీలో ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు, లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్‌ షిండే అధికారిక నివాసంలో రహస్యంగా సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సమావేశంలో విలీన వ్యూహాన్ని ఖరారు చేసుకున్న అనంతరం.. వీరంతా కలిసి, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ వర్తమాన రాజకీయ పరిణామాలపై లోతైన విశ్లేషణను అందిస్తూ సాగిన వాస్తవ వేదిక చర్చా..
ఆంధ్రప్రదేశ్ ఖనిజ మరియు గనుల సంపదకు సంబంధించిన తాజా రాజకీయ, ఆర్థిక పరిణామాలను విశ్లేషిస్తూ, మీ రిక్వెస్ట్ మేరకు రూపొందించిన ప్రత్యేక వ్యాసం కింద ఇవ్వబడింది.
మెటా సంస్థ కేవలం ఒకరి ఫిర్యాదుతో ఓవర్ నైట్ ఏ అకౌంట్‌ను సస్పెండ్ చేయదని ఆయన చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పదే పదే ఉల్లంఘించడం వల్లే ఈ బ్లాక్ జరిగిందని వివరించారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ ద్వారా రికార్డు స్థాయిలో 15,941 మంది నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు లభించాయనీ.. అయితే వైసీపీ నేతలు తప్పుడు ఆధారాలు, ఫేక్ ఆడియో క్లిప్పింగులతో సమాజంలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించారని అప్పసాని రాజేష్ ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.