Publish Date:Mar 29, 2026
ఆంధ్రప్రదేశ్ కుఅమరావతి ఒక్కటే రాజధాని అని చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం (మార్చి 29) ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్తలను, వెనుకబడిన వర్గాల వారిని గుర్తించి వారిని చట్టసభలకు పంపించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు.
ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో, భవిష్యత్తులో అమరావతిని హైదరాబాద్‌ను మించిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వాసులకు హామీ ఇచ్చారు. రాజధాని అభివృద్ధిని అడ్డుకునే శక్తులను, వ్యతిరేకించే వారిని అక్కడకు రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ఇకపై మూడు ముక్కలాట ఉండదన్నారు. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ శక్తి మాత్రమే కాదని, అది తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన ఒక గొప్ప వ్యవస్థ అన్న చంద్రబాబు.. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు అనేక చారిత్రాత్మక రికార్డులు నెలకొల్పామని గుర్తుచేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amarawathi-world-class-capital-25-216368.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.