ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం వద్ద టీటీడీ నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె.శ్యామల రావు మంగళవారం (డిసెంబర్ 31) సందర్శించారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన రోజువారి రోజువారి జరుగుతున్న కైంకర్యాలను, దాతల సహకారంతో ఇప్పటికే జరుగుతున్న అన్నదాన కార్యక్రమ వివరాలను, ఇతర కార్యక్రమాలను ఈవోకు అధికారులు తెలియజేశారు. తిరుమలలో జరుగుతున్న విధంగానే అమరావతి ఆలయంలోనూ శ్రీవారి రోజువారీ సేవలు జరగాలని ఆయన ఈ సందర్భంగా ఆలయ అధికారులను ఆదేశించారు.
టిటిడి సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్ , అన్నదానానికి అవసరమైన భవనాలు, భక్తులు వేచి ఉండేందుకు హాల్, స్వామివారి వాహనాల కోసం వాహన మండపం, ఆహ్లాదకరంగా గార్డెనింగ్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఈవో శ్యామలరావు ఈ సందర్భంగా ఆదేశించారు.
ఆలయానికి సంబంధించి రూపొందించిన ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ఆలయ నిర్మాణానికి ముందు తయారు చేసిన ప్లాన్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని టిటిడి ఇంజనీరింగ్ అధికారులను ఈవో ఆదేశించారు.
వైకుంఠ ఏకాదశి రద్దీ నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకుముందు ఆలయానికి ఈవో చేరుకోగానే సాంప్రదాయ బద్ధంగా ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి వేదశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఇఇ నాగభూషణం, సూపరెంటెంట్ మల్లికార్జున, టెంపుల్ ఇస్పెక్టర్ రామకృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్ జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amarawathi-venkateswaraswamy-temple-like-39-190640.html
ప్రధాని మూడోసారి ప్రధానిగా అయ్యాక రెండోసారి ఎపిలో పర్యటిస్తున్నారు. ఆయన విశాఖకు చేరుకోవడం చర్చనీయాంశమైంది. కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. సిరిపురం చౌరస్తానుంచి ఏయు ఇంజినీరింగ్ కాలేజివరకు ర్యాలీ నిర్వహించారు
ఫార్ములా-ఈ కార్ కేసులో ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ కు ఒకే సమయంలో మోదం; ఖేదం కలిగేలా కోర్టు తీర్పు వెలువరించింది.
ఇప్పటికే ఫార్ములా ఈ రేసు కేసులో చిక్కులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుపై మరో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఔటర్ రింగు రోడ్డు టెంటర్లలో అవినీతికి సంబంధించింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసుకున్న లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు అందుకు నో చెప్పింది.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఎసిబి విచారణకు కెటీఆర్ న్యాయవ్యాదులను అనుమతించకపోవడంపై బుధవారం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. న్యాయవాదులను అనుమతించకపోవడానికి కారణమేమిటని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది
ఎన్నికల వ్యూహకర్త, జనసూరజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఆయన ఇటీవల ఆమరణ నిరాహార దీక్ష చచే పట్టారు. పోలీసులు ఆ దీక్షను భగ్నం చేశారు. అయితే ఆ దీక్ష కారణంగా ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.
మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్న సమాచారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి భద్రత పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జడ్ ప్లస్ క్యాటగరి భద్రత ఉన్న చంద్రబాబు సెక్యూరిటీలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు వచ్చి చేరాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఉన్నట్లా లేనట్టా అన్న చర్చ జరుగుతోంది. ఈ సారి సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు డీఏలను ప్రకటించే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరిగింది.
గత వారం రోజులుగా మీడియాలో వస్తున్న ప్రచారంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు టీం ఖండించింది. . ఈ ప్రచారంపై కుట్ర కోణం ఉందని ఆరోపించింది.
తెలుగురాష్ట్రాలను చలి పులి చంపేస్తోంది. రెండు రాష్ట్రాలలోనూ కూడా తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఉదయం పది గంటల వరకూ కూడా బయటకు రావడానికి జంకుతున్న పరిస్థితి.
మొదటి వారం చివరి రోజున జెపిసి నివేదికను లోకసభ సమర్పించాల్సి ఉంటుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్బంగా సవరణ బిల్లు ను కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు.
బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ పార్టీకి చెందిన నేతలు ఒకరి తరువాత ఒకరు జైలుకెడుతున్నారు. త్వరలో కేటీఆర్ కూడా జైలుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ, ఈడీలు దూకుడు పెంచాయి. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసిన తరువాత ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని అర్ధం చేసుకున్న నిందితులు విచారణ సంస్థలకు సహకరించకతప్పని పరిస్థితుల్లో పడ్డారు.