ముగింపు దశకు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు.. టోన్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్..!
Publish Date:Aug 7, 2026
Advertisement
నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపురేఖలు మార్చే అత్యంత ప్రాధాన్యమైన పనుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం ఒకటి. గత కొన్నేళ్లుగా రవాణా పరంగా తీవ్ర అవస్థలు పడుతున్న సామాన్య ప్రజలకు, రోజువారీ ఉద్యోగులకు, అలాగే రాజధాని రైతులు, వ్యాపారులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం. విజయవాడ నుంచి అమరావతి వెళ్లే మార్గంలో ఉండవల్లి సమీపంలో బకింగ్ హామ్ కాలువ, కొండవీటి వాగులపై రూపుదిద్దుకుంటున్న భారీ స్టీల్ బ్రిడ్జిలు సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. ఈ అంశాంపై టోన్ న్యూస్ ప్రత్యేక కథనం. రాత్రింబవళ్లు శ్రమిస్తూ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఈ పనులను పూర్తి చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఉండవల్లి కరకట్ట మీదుగా ప్రయాణించడమంటే సామాన్యుడికి ఒక తీవ్రమైన పరీక్షగా మారింది. ఇరుకైన రహదారి, నిత్యం ట్రాఫిక్ జామ్‌లు, చిన్నపాటి వర్షం పడినా రవాణా స్తంభించిపోవడం వల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లే బాధితులు, సమయానికి కార్యాలయాలకు చేరుకోవాల్సిన ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు రోడ్లపై గంటల తరబడి చిక్కుకుపోయి అనుభవించిన వేదన వర్ణనాతీతం. "ఈ కరకట్టపై ప్రయాణం రోజువారీ నరకం లాంటిది. రోజూ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకుంటామో లేదో అనే భయం మమ్మల్ని వెంటాడేది" అని స్థానిక ప్రయాణికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు మరియు స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తి కావస్తుండటంతో రాజధాని ప్రాంతంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 110 మీటర్ల మేర బకింగ్ హామ్ కాలువపై, 284 మీటర్ల మేర కొండవీటి వాగుపై రూపుదిద్దుకున్న అత్యంత ఆధునిక స్టీల్ బ్రిడ్జిలు ఈ ప్రాంత రవాణా వ్యవస్థకు ప్రధాన మైలురాయిగా నిలవనున్నాయి. ఈ రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, విజయవాడ నుండి అమరావతికి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, కరకట్టపై ఉండే విపరీతమైన ట్రాఫిక్ ఒత్తిడి తగ్గనుంది. కేవలం రవాణా సౌకర్యమే కాకుండా, ఈ ప్రాజెక్టు మానవీయ, సౌందర్య కోణంలో కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. రహదారికి ఇరువైపులా పచ్చని గార్డెన్లు, వాకింగ్ సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అనేక కష్ట నష్టాలను ఓర్చి, తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు, స్థానిక ప్రజలకు ఈ రహదారి అందుబాటులోకి రావడం ఒక భావోద్వేగపూరితమైన ఘట్టం. "మా కళ్ల ముందే మళ్లీ అమరావతి ప్రగతి పరుగులు తీస్తోంది. కష్టాలు తొలిగిపోతున్నాయనే నమ్మకం కలుగుతోంది" అని స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ కలల రహదారి ప్రజలకు అందుబాటులోకి వచ్చి రవాణా కష్టాలకు శాశ్వతంగా చరమగీతం.. టోన్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్.. Amaravati Seed Access Road, Amaravati Steel Bridge, Undavalli Steel Bridge, Vijayawada Amaravati Traffic, Buckingham Canal Bridge, Kondaveeti Vagu Steel Bridge, AP Capital Amaravati,Seed Access Road Final Works
http://www.teluguone.com/news/content/amaravati-seed-access-road-36-228339.html





