అమరావతికి ఐకానిక్ గేట్ వే.. ఆరు లేన్ల ఎలివేటెడ్ బ్రిడ్జి.!
Publish Date:Aug 8, 2026
Advertisement
రాజధాని అమరావతి, విజయవాడ నగరాల మధ్య ఇంజినీరింగ్ అద్భుతం ఆవిష్కృతమౌతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నిత్యం నరకయాతన చూపిస్తున్న ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారంగా.. కృష్ణా నదిపై సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణానికి తొలి అడుగు పడింది. అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసీఎల్) ఈ ఐకానిక్ సిగ్నేచర్ బ్రిడ్జికి సంబంధించిన ఫీజిబిలిటీ, డీపీఆర్ (డీపీఆర్), కన్సల్టెన్సీ కోసం టెండర్ల ప్రక్రియను చేపట్టింది. ప్రకాశం బ్యారేజీకి 300 మీటర్ల దిగువన సీతానగరం ఘాట్ నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్‌ను, మచిలీపట్నం, హైదరాబాద్ జాతీయ రహదారిని నుసంధానిస్తూ ఈ ఐకానిక్ బ్రిడ్జి బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. 1.10 కిలోమీటర్ల పొడవునా ఎలివేటెడ్ విధానంలో 6 లేన్ రోడ్డుతో దీనిని తీర్చిదిద్దుతున్నారు. ప్రయాణికుల సురక్షిత రాకపోకలతో పాటు సందర్శకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లను కూడా నిర్మించనున్నారు. ఈపీసీ ( పద్ధతిలో చేపట్టే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం, కాన్సెప్ట్ డిజైన్లు ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ 3 నెలల్లో ప్రభుత్వానికి సమర్పించనుంది. అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుకు నేరుగా కనెక్టివిటీ కల్పించే ఈ వంతెన రాజధానికి గేట్‌వే గా నిలవనుంది. వంతెన నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణ సమీకరణ చేయనున్నారు. నిత్యం లక్షలాది వాహనాలతో కిటకిటలాడే ప్రకాశం బ్యారేజీపై ట్రాఫిక్ ఒత్తిడిని ఈ నూతన వంతెన గణనీయంగా తగ్గిస్తుంది. ఎన్‌హెచ్-65తో నేరుగా అనుసంధానం కావడం వల్ల జిల్లాల మధ్య సరుకు రవాణా వేగవంతమై పారిశ్రామిక ప్రగతి, ఆర్థిక వ్యవస్థ పరుగతి మరింత వేగం పుంజుకోవడానికి కూడా ఈ ఐకానిక్ బ్రిడ్జి దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Amaravati Gate way, infrastructure Bridge, 6lane, National Highway, Krishna River Bridge Vijayawada, AP Infrastructure Tenders,
http://www.teluguone.com/news/content/amaravati-gate-way-36-228379.html





