ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక ఆ బిల్లు చట్టరూపం దాల్చే దిశగా తుది అడుగుకు చేరింది. ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
అమరావతి బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ దాదాపు ఐదు గంటల పాటు చర్చ జరిగింద. ఉభయ సభలూ ఈ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. వైసీపీ వినా దాదాపు దేశంలోని రాజకీయ పార్టీలన్నీ అమరావతికి సై అన్నాయి. వైసీపీ ఓ వైపు అమరావతికి వ్యతిరేకం కాదంటూనే ఈ బిల్లుపై జరిగిన చర్చను మాత్రం బాయ్ కాట్ చేసి ఓటింగ్ కు దూరంగా ఉన్నది.
పార్లమెంట్‌లో ఉభయ సభలలోనూ ఆమోదం పొందిన అమరావతి బిల్లును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతికి పంపింది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్రపతి ఆమోదం అనేది కేవలం లాంఛనప్రాయమే. రాష్ట్రపతి సంతకం చేయడంతోనే అమరావతి రాజధాని చట్టం అమలులోకి వస్తుంది. గత కొన్నేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amaravati-bill-reaches-the-president-25-216767.html
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.