స్టీల్ బ్రిడ్జ్ ఈ -13 రోడ్డు నిర్మాణాలపై వైసీపీ ఫేక్ ప్రచారాలు

Publish Date:May 17, 2026

Advertisement

 

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని, అక్కడ శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్న వైసీపీ కుతంత్రాలు పన్నుతూనే ఉంది. అభివృద్ధి పనుల్లో లోపాలు, అవినీతి అంటూ విషం చిమ్ముతూనే ఉంది. అందులో భాగంగా అమరావతిని 16వ నెంబరు జాతీయ రహదారితో కలుపుతూ బ‌కింగ్ హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి గ‌డ్డ‌ర్లు ఒరిగిపోయాయంటూ వైసీపీ తన అనుకూల మీడియాలో విషప్రచారం మొదలుపెట్టింది. అయితే ఆ వార్త‌లు పూర్తిగా అవాస్త‌వమని అమరావతి డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ తెలిపింది. బ్రిడ్జి నిర్మాణం అత్యంత భద్రతా ప్రమాణాలతో కొనసాగుతోందని.. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి ప్రజలెవరూ వైసీపీ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని అమ‌రావ‌తి డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఏడీసీఎల్) స్పష్టం చేసింది.

అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమరావతిని నేషనల్ హైవే 16కు కనెక్ట్ చేసేందుకు బ‌కింగ్ హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జిని ఈ ఫిబ్రవరికి పూర్తిచేయాలనుకున్నా సాధ్యపడలేదు.. అయితే త్వరలోనే పూర్తి చేస్తామంటున్నారు. ఇంతలో స్టీల్ బ్రిడ్జి ఒరిగిపోయిందంటూ ఫేక్ ప్రచారం మొదలైంది. ఈ బ్రిడ్జికి సంబంధించి రెండో వంతెన మధ్యలో గడ్డర్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఒంగిపోయాయని ప్రచారం జరుగుతోంది. గడ్డర్లు వంకర ఉన్నచోట్ల తొలగించి మళ్లీ బిగించి శ్లాబు వేస్తున్నారని చెబుతున్నారు.
స్టీల్ బ్రిడ్జి గ‌డ్డర్లు ఒరిగిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఏడీసీఎల్ స్పందించింది. 

బ్రిడ్జి ఒరిగిపోయిందంటూ వ‌స్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. ఈ స్టీల్ బ్రిడ్జిల నిర్మాణంలో ప్రత్యేక సాంకేతిక విధానాలతో పొడవైన గడ్డర్లను తయారుచేసి జాయింట్ చేస్తారని ఏడీసీఎల్ తెలిపింది. గడ్డర్లకు సంబంధించి ఇంజినీరంగ్ ప్రమాణాలకు తగిన విధంగా చిన్న సవరణలు మాత్రమే చేపట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రక్రియలో గడ్డర్లు మిల్లీమీటర్ల స్థాయిలో బేరింగ్‌లపై అమర్చాల్సి ఉంటుందన్నారు. స్ట్రీల్ బ్రిడ్జి నిర్మాణంలో, భద్రత అంశాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.
ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా ఈ అంశంపై స్పందించింది. 

బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన గడ్డర్లు ఒరిగిపోయాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తీవ్రంగా ఖండించింది. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణంలో పొడవైన గడ్డర్లు జాయింట్ చేస్తారని, బేరింగ్‌లపై గడ్డర్లు అనుసంధానించేటప్పుడు.. ఒక్కోసారి గడ్డర్ల జాయింట్లను విడదీసి సరిచేస్తారని , అంతే కానీ గడ్డర్లు ఒరిగిపోతున్నాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వివరించింది. మరోవైపు మంగళగిరి ఎయిమ్స్  సమీపంలో పర్యావరణ శాఖ కళ్ళుకప్పి కొండలను అక్రమంగా తవ్వేస్తూ, ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. 

అమరావతిని, మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానించే అత్యంత ప్రతిష్టాత్మకమైన E13 రోడ్డు నిర్మాణ పనులు సక్రమంగానే జరుగుతున్నాయని వెల్లడించింది. మంగళగిరి ఎయిమ్స్ మీదుగా అమరావతి కోర్ క్యాపిటల్‌కు వెళ్లే రహదారి మార్గంలో కొండ భాగం అడ్డుగా ఉందని, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి ప్రభుత్వం అధికారికంగా 'హిల్ కట్టింగ్' పనులను చేపట్టిందని వివరించింది. 

వాస్తవానికి ఏడీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల పర్యావరణ.అధికారిక అనుమతులు ఉన్నాయి. నిబంధనల ప్రకారమే ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాజధాని అమరావతి కనెక్టివిటీ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న E13 రహదారి అభివృద్ధి పనులను, సోషల్ మీడియాలో కొందరు అక్రమ కొండల తవ్వకం, ప్రకృతి విధ్వంసం అంటూ తప్పుడు రంగు పులిమి తప్పుదారి పట్టిస్తున్నారని, కాబట్టి ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
 

By
en-us Political News

  
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.