ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి.. 28న అసెంబ్లీ తీర్మానం

Publish Date:Mar 25, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి. ఈ విషయంలో వైసీపీకి వినా మరెవరికీ ఎటువంటి అభ్యంతరాలు, అనుమానాలూ లేవు. అయితే అడుగడుగునా అమరావతికి అడ్డంకులు కల్పిస్తూ వైసీపీ చీకాకులు సృష్టిస్తోంది. జగన్ ఐదేళ్ల హయాంలో అప్పటికి వేగంగా జరుగుతున్న అమరావతి నిర్మాణాన్ని నిలిపివేసి.. నిర్వీర్యం చేసింది. అమరావతికి భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులూ పెట్టింది. అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి విజయం సాధించి అధికారంలోకి రావడంతో అమరాతి అడ్డంకులు తొలిగిపోయి ఏకైక రాజధాని నిర్మాణం శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించేందుకు సమాయత్తమౌతోంది. ఇందు కోసం ఈ నెల 28 రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండా అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమెదించడమే. ఇది ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక ముందడుగుగా భావించవచ్చు.

ఇప్పటికే  అమరావతిని ఆంధ్రప్రదేశ్  ఏకైక  శాశ్వత రాజధానిగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే  పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన   బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఆమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా తీర్మానం ఆమెదించి కేంద్రానికి పంపిస్తే.. ఆ దిశగా కేంద్రం పార్లమెంటులో సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటులో ఎన్డీయేకు ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఆ బిల్లు ఆమోదం లాంఛనమే. ఇక బిల్లు ఆమోదం పొందితే అమరావతికి తిరుగులేని చట్టబద్ధత లభిస్తుంది.  ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కేటాయించిన సంగతి తెలిసిందే.  ఆ గడువు దాదాపు రెండేళ్ల కిందటే.. అంటే 2024 జూన్ 2తో ముగిసింది. అంటే అప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఉందన్న మాట.  

సీఎం చంద్రబాబు ఇటీవలి తన హస్తిన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో  రాజధానిగా అమరావతికి చట్టబద్ధతపై చర్చించారు.  గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిపై నెలకొన్న గందరగోళాన్ని పూర్తిగా తొలగించాలంటే పార్లమెంట్‌లో చట్టబద్ధత అవసరమని గట్టిగా చెప్పారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఇప్పటికే ముసాయిదా బిల్లు కూడా రెడీ అయ్యిందని తెలుస్తోంది.

ఈ ముసాయిదా బిల్లుకు  న్యాయ, పట్టణాభివృద్ధి శాఖల నుంచి ఆమోదం కూడా అభించిందని అంటున్నారు. దీంతో అసెంబ్లీ  అమరావతి  ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ   తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపడం  ఇక ఎలాంటి జాప్యం లేకుండా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపడాన్ని మార్షల్స్ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మార్షల్స్‌ను అడ్డం పెట్టుకుంటోందని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంద మంది ప్రముఖులతో ప్రకటించిన ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు చోటు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈ జాబితాలో 13వ స్థానం దక్కగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 25వ స్థానంలో నిలిచారు.
హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ, ఈ సందర్భంగా బలమైన ఈదురుగాలులతో పాటు వడగళ్లు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోలో పలు పథకాలు ప్రకటించారు. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని కుటుంబాల్లోని మహిళలకు ఇల్లతరసి పథకం కింద గృహోపకరణాలు కొనుగోలుకు 8వేల రూపాయల విలువైన వన్ టైమ్ కూపన్ ప్రకటించారు. ప్రస్తుతం మహిళా కుటుంబ పెద్దలకు నెలనెలా ఇస్తున్న వెయ్యిరూపాయల ఈర్థిక సయాన్ని రెండు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు ఇప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవంతో, భవిష్యత్తులో అమరావతిని హైదరాబాద్‌ను మించిన ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర వాసులకు హామీ ఇచ్చారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగు సమాజం మీద తెలుగేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికి చెరిగిపోనిది. నటుడిగా అయన కృషి అజరామరం. రాజకీయ నాయకుడిగా అయన 14 ఏళ్ల ప్రస్థానంలో అయన ప్రభావం మహత్తరం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు, తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి, అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ ఉన్నతికి తోడ్పడం లో ఎన్టీఆర్ చూపించిన చొరవ నభూతో నభవిష్యతి.
ఈ తీర్మానంలో ప్రధానంగా ప్ర‌స్తావించిన సెక్ష‌న్ 5 స‌వ‌ర‌ణ అత్యంత కీల‌కం. 2014 ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ ఐదు ప్ర‌కారం.. హైద‌రాబాద్ ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంది. ఆ త‌ర్వాత ఏపీకి కొత్త రాజ‌ధాని ఉండాల‌ని ఉంది. కానీ, దాని పేరు అమ‌రావ‌తి అని ఎక్క‌డా స్ప‌ష్టంగా లేదు. ఈ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అనే ద‌గ్గ‌ర అమ‌రావ‌తి అనే ప‌దాన్ని చేర్చాల‌ని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం తీర్మానం చేసింది.
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
తాజాగా కాకినాడ జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివకాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ బషీర్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ‌. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా.
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు.
కేంద్రమంత్రి పెమ్మ‌సాని, అంబ‌టి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.